సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ అందంగా కనిపించడానికి ఎంత తాపత్రయపడుతూ ఉంటారో మనకు తెలిసిందే . అయితే ఇప్పటి హీరోయిన్స్ మాత్రమే అందాల కోసం లేటెస్ట్ టెక్నాలజీస్ ని వాడుకుంటూ రకరకాల ప్రోడక్ట్స్ ని ముఖానికి రాసుకుంటూ .. కఠినమైన డైట్ తో మరింత అందంగా కనిపించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఒకప్పటి హీరోయిన్స్ కి ఈ ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ గురించి తెలియదు . కానీ వాళ్ళు చాలా చక్కగా అందంగా ఉండేవారు . మరి ఎలా అది సాధ్యం అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది .
మరీ ముఖ్యంగా మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న సావిత్రి గారు అందం కోసం అప్పట్లో పాటించిన టిప్స్ మరోసారి నెట్టింట వైరల్ గా మారాయి. సావిత్రి ఇండస్ట్రీలో ఒక మహానటి ..ఆమె మన మధ్య లేకపోయినప్పటికీ ఇప్పటికీ జనాలు ఫేవరెట్ హీరోయిన్ గానే చెప్పుకొస్తున్నారు . అంతేకాదు సావిత్రి గారు నటించిన సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే సావిత్రి చాలా చక్కగా ఉంటుంది . అందంగా ఉంటుంది ..అట్రాక్టివ్ గా ఉంటుంది. కుందనపు బొమ్మ అనే చెప్పాలి.
అంత అందంగా సావిత్రి కనిపించడానికి మెయిన్ కారణం ఆమె తీసుకునే జాగ్రత్తలే. ఆమె ఫుడ్ ఇష్టం వచ్చినట్లు తింటుందట . కానీ ముఖం కాంతివంతంగా మెరవడానికి కారణం ఆమె నీళ్లను ఎక్కువగా తాగుతుంది. అంతేకాదు ఇప్పుడు డైట్ డైట్ అండ్ ఫాలో అవుతున్న హీరోయిన్స్ లాగా సావిత్రి ఏమి వ్యాయామాలు చేసేది కాదు ..అలా అని బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగేది కాదు ..చక్కగా ఇంటిలోనే సున్నిపిండిని తయారు చేసుకుని పసుపుని ముఖానికి రాసుకొని ట్రెడిషనల్ పద్ధతుల్లోనే ఆమె అందంగా ఉండడానికి ట్రై చేసేదట . సావిత్రి వారానికి ఒక్కసారి అయినా సరే సున్నిపిండి పెట్టుకొని స్నానం చేస్తుందట. అంతేకాదు ఆమె అందం విషయం కన్నా కూడా నటన విషయం గా ఎక్కువగా కాన్సెంట్రేషన్ చేసేదట. అందుకే ఆమె మహానటిగా మారింది..!!