చిరంజీవి ..మళ్లీ ఆ ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమాను ఓకే చేశాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవిని బాగా ట్రోలింగ్కి గురి చేశారు ఆకతాయిలు. దానికి కారణం భోలాశంకర్ సినిమా . మెహర్ రమేష్ దర్శకత్వంలో తమన్న హీరోయిన్గా కీర్తి సురేష్ సిస్టర్ క్యారెక్టర్ లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరమ చెత్త టాక్ సంపాదించుకుంది . ఎలా అంటే అసలు చిరంజీవిపై ఉన్న ప్రేమను పరువును రెండిటిని తీసేసింది . ఇంకోసారి మెహర్ రమేష్ కి ఛాన్స్ ఇవ్వద్దు సార్ అంటూ మెగా అభిమానులే ఓపెన్ గా చెప్పే పరిస్థితి దాపురించింది .
అయితే ఎలాగోలా ఆ ఫ్లాప్ ఛాయాలనుంచి బయటపడుతూ వస్తున్న మెగా ఫ్యాన్స్ కు మరో బిగ్ షాక్ తగలబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ప్రెసెంట్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర షూట్లో బిజీగా ఉన్న చిరంజీవి ఆ తర్వాత మళ్లీ మెహర్ రమేష్ తో ఓ సినిమాను ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . మెహర్ రమేష్ పై ఉన్న అభిమానంతోనే ఆయన ఈ విధంగా సినిమాకి కమిట్ అవుతున్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు .
అయితే ఒకసారి ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కు మళ్లీ మళ్లీ అవకాశం ఇవ్వడం ఏంటి..? అంటూ మెగా ఫాన్స్ మండిపడుతున్నారు . దానికి తగ్గట్టే మెహర్ రమేష్ చిరంజీవి విశ్వంభరలో కలిసిన ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి . తెలుగు డైరెక్టర్ అసోసియేషన్ తరపున పలువురు దర్శకులు చిరంజీవిని కలవడానికి విశ్వంభర సెట్స్ కు వెళ్లారు. అందులో మెహర్ రమేష్ కూడా ఉన్నాడు. ఆ ఫొటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే మెగా ఫాన్స్ మాత్రం వద్దు బాబోయ్ వద్దు ఆ డైరెక్టర్ తో సినిమానే వద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు..!!