Movies"నన్ను డ్రగ్స్ కేసులో ఇరిక్కించింది వాళ్లే..నాకు అన్ని తెలుసు".. సంచలన విషయాని...

“నన్ను డ్రగ్స్ కేసులో ఇరిక్కించింది వాళ్లే..నాకు అన్ని తెలుసు”.. సంచలన విషయాని బయట పెట్టిన నీహారిక ..!!

నిహారిక .. మెగా డాటర్ గా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . అబ్బో అమ్మాడి క్రేజ్ గురించి చెప్పాలంటే ..అంత ఇంత కాదు .. సోషల్ మీడియాలో బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . అయితే అంతా బాగా ఉంది అనుకున్న టైంలో ఆమె విడాకులు తీసేసుకుంది . చైతన్యను పెళ్లి చేసుకున్న నిహారిక కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుంది. వీళ్ళ విడాకుల గురించి ఇప్పటికి సోషల్ మీడియాలో హాట్ హాట్ వార్తలు ట్రెండ్ అవుతూనే ఉంటాయి .

అయితే నిహారిక విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణం ఆమె రాడిసన్ డ్రగ్స్ కేసులు ఇరుక్కోవడమే అంటూ ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది నిహారిక . ఆమెను అన్యాయంగా ఇరిక్కించారు అంటూ మండిపడ్డింది. ” నేను పబ్బులకు ఎక్కువగా వెళ్ళను ..నా ఫ్రెండ్స్ అందరికీ అది తెలుసు.. ఆ రోజు మా స్కూల్ ఫ్రెండ్స్ ను కలవడానికి మాత్రమే నేను అక్కడికి వెళ్లాను.. దాదాపు ఆరు నెలల తర్వాత మేమంతా కలిశాము ..అది కూడా ఒక ఫ్రెండ్ పిలిస్తేనే వెళ్లాను.. కాసేపు అక్కడే ఉండి మాట్లాడుకొని సౌండ్స్ వల్ల ఇబ్బంది అనిపించడంతో బిల్ కట్టి వెంటనే వచ్చేస్తూ ఉన్నాను.. నేను బయటకు వస్తున్న సమయంలోనే పోలీసులు వచ్చారు “.

“దీంతో అందరితోపాటు మమ్మల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు ..ఇక మీడియా రచ్చ రచ్చ చేసి ఏదేదో వార్తలు రాసేసింది .. నాకు అప్పుడు అర్థం కాలేదు.. నా తప్పు లేకుండా నన్ను ఎందుకు ఇరికిస్తున్నారు అని బాధేసింది ..ఆ తర్వాత ఆ పబ్లో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నారు అని పోలీసులకు తెలిసి.. అందుకే వారిని అరెస్ట్ చేయడానికి వచ్చారు అని అర్థమైంది.. అప్పుడే తెలుసుకున్నాను నేను తప్పుడు ప్రదేశంలో ఉన్నాను ..లేటుగా ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాను అని.. అప్పటినుంచి పబ్ లకి వెళ్లడమే మానేశాను”..అంటూ చెప్పుకొచ్చింది. ప్రసెంట్ నీహారిక హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. పలు సినిమాలను కూడా నిర్మిస్తూ వస్తుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news