సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఫేక్ వార్తలు అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం . మరీ ముఖ్యంగా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కి సంబంధించిన ఫేక్ వార్తలు రోజు కి 10 అయినా వింటూ ఉంటాం . అయితే కొన్ని ఫేక్ వార్తలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. మరికొన్ని మాత్రం సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి అల్లకల్లోలం చేసేసాయి . అలా సినిమా ఇండస్ట్రీని కుదేలు చేసిన టాప్ ఫైవ్ ఫేక్ వార్తలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..!
1) సమంత – నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఒక స్టార్ హీరో వద్ద అప్పు చేసిందని ..ఆమె మయోసైటిస్ వ్యాధికి గురైన తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఐదు కోట్ల వరకు స్టార్ హీరో దగ్గర అప్పుగా తీసుకుంది అంటూ ప్రచారం జరిగింది. అయితే అదంతా ఫేక్ అంటూ సమంత కొట్టి పడేసింది.
2) టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తో బీచ్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అంటూ ప్రచారం జరిగింది .ఆది పురుష్ సినిమా టైంలో ఇలాంటి ప్రచారం ఎక్కువగా జరిగాయి . అయితే వీళ్ళిద్దరికీ ఒక రిసార్ట్లో ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి . అయితే ఆ తర్వాత అలాంటి దంతా ఏది లేదు అంటూ కృతిసినన్ క్లారిటీ ఇచ్చింది.
3) టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమాను మొదటగా మహేష్ బాబుకు వివరించారు అని ఆయన రిజెక్ట్ చేస్తేనే ఆఫర్ రన్బీర్ కపూర్ కు వెళ్ళింది అని ప్రచారం జరిగింది . అయితే ఫైనల్లీ సందీప్ రెడ్డివంగా క్లారిటీ ఇచ్చారు.. మహేష్ కు వినిపించిన స్టోరీ ఇది కాదు అని ..వేరే స్టోరీ అని..యానిమల్ సినిమా స్టోరీ డిఫరెంట్ అని క్లారిటీ ఇచ్చారు.
4)నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. రెమ్యూనరేషన్ పూర్తిగా ఇస్తేనే సినిమాలకు కమిట్ అవుతుంది అని పూర్తి రెమ్యూనరేషన్ తన ఖాతాలో పడిన తర్వాతే సినిమా సెట్స్ కి వస్తుంది అంటూ బాగా ప్రచారం జరిగింది . అయితే అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేసింది రష్మిక మందన్నా..
5)సెకండ్ ఇన్నింగ్స్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న ప్రియమణి తన కెరియర్ స్టార్టింగ్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోతో ప్రేమాయణం కొనసాగించింది అని.. ఆ హీరోకి పెళ్లయి పిల్లలు ఉన్న కూడా ఆయననే పెళ్లి చేసుకోవాలి అంటూ తెగ ట్రై చేసింది అని ..ఆ హీరో భార్య ఎంట్రీ ఇవ్వడంతో ప్రియమణి సైలెంట్ అయిపోయింది అంటూ తెగ ప్రచారం జరిగింది. సీన్ కట్ చేస్తే ప్రియమణి ముస్తఫాను ప్రేమించి పెళ్లి చేసుకుంది . ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో ఆమె ఏ స్థాయిలో ఉందో మనకు తెలిసిందే..??