సినిమా ఇండస్ట్రీలో మోసాలు ఎక్కువ..? ఏం మాత్రం తటస్థంగా ఉన్న కట్టుకున్న లుంగీను కూడా దొబ్బేసే టైప్. ఈ విషయం అందరికీ తెలిసిందే . అయితే చాలామంది ఇది సామాన్య హీరోల విషయంలో మాత్రమే జరుగుతుంది . బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోల విషయంలో మాత్రమే ఉంటుంది అనుకుంటారు . కానీ అది తప్పు అంటూ ప్రూవ్ చేశాడు నాగచైతన్య .ఇండస్ట్రీలో పేరు ..పలుకుబడి ..పెద్ద తోపు క్యారెక్టర్ గల వ్యక్తి అయినా సరే అలాంటి వాళ్ల చేతుల్లో మోసపోవడం కామన్ అంటూ ప్రూవ్ చేశాడు మన నాగచైతన్య .
నాగచైతన్య అనగానే అందరికీ ముందు గుర్తొచ్చేది అక్కినేని ఫ్యామిలీ . అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలో బాగానే పాపులారిటీ దక్కించుకున్నాడు . కానీ హిట్లు కొట్టింది మాత్రం చాలా తక్కువ . ఏదో అప్పట్లో అడపాదడపా ఒకటో రెండో హిట్లు పడ్డాయే కానీ నాగచైతన్య ఫుల్ లెంత్ హీరోగా సక్సెస్ కొట్టింది ఒక్క సినిమా కూడా లేదు .
కాగా విడాకులు తర్వాత నాగచైతన్యను ఓ పాన్ ఇండియా హీరో మోసం చేశాడు అన్న వార్త వైరల్ గా మారింది . “నీ కెరియర్ని నేను బాగుపరుస్తాను ..నీ కాల్ షీట్స్ ఇవ్వు.. చించేద్దాం కుమ్మేద్దాం అంటూ ఓ రేంజ్ లో మాటలు చెప్పి కాల్ షీట్స్ తీసుకున్నాడట . అయితే లాస్ట్ కి ఆ హీరో నాగచైతన్య కంటే పెద్ద హీరోతో ఆఫర్ రావడంతో నాగచైతన్యకు హ్యాండ్ ఇచ్చి ఆ హీరోతో సినిమాలు చేస్తున్నాడట . ఈ విషయం తెలిసిన నాగచైతన్య ఫుల్ రేంజ్ లో ఫైర్ అయిపోయి శాపనార్థాలు కూడా పెట్టాడట “.
అంతేకాదు నాగార్జున మ్యాటర్ లోకి ఇన్వాల్వ్ అయిన పరిస్థితి చక్కదిద్దలేకపోయాడు. ఇక చేసేది ఏమీ లేక నాగచైతన్య తన కాల్ షీట్స్ ని వేస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే తండేల్ విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాడు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!