ఈ మధ్యకాలంలో ట్రెండ్ మారిపోయింది . ఒకప్పుడు హీరోయిన్స్ అవకాశాలు వస్తే పెద్ద హీరోల సినిమాలో నటించేవాళ్లు .. కానీ ఇప్పుడు పెద్ద హీరోలే హీరోయిన్స్ మా సినిమాలో నటించాలి అంటూ వాళ్ళ ఇంటికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తున్నారు . టైం అలా మారిపోయింది అంతే. అయితే టాప్ మోస్ట్ హీరోయిన్ ఇంటికి వెళ్లి అలా రిక్వెస్ట్ చేసిన ఒక అర్థం ఉంటుంది.
ఫేడౌట్ అయిపోయి అసలు అవకాశాలు లేని ఇంటికి వెళ్లి చెక్ ఇచ్చి మరి నువ్వు నా సినిమాలో చేయాలి అని అడగడం.. చాలా చాలా రేర్ ..ఎంతో అదృష్టం ఉంటే తప్పిస్తే అలాంటివి జరగవు. అలాంటి అరుదైన అదృష్టాన్ని అందుకుంది కృతి శెట్టి అన్న న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. కృతి శెట్టి ఉప్పెన సినిమాతో స్టార్ హీరోయిన్గా మారింది .
ఆ తర్వాత నటించిన సినిమాలు పరలేదు అనిపించినా.. తర్వాత మాత్రం ఫ్లాప్ అందుకుంది. అయితే కృతి శెట్టి ప్రజెంట్ పలు సినిమాలతో తన పేరు జనాలు మర్చిపోకుండా ఏదో గుర్తుండే స్థాయిలో ట్రై చేస్తుంది. అయితే రీసెంట్గా ఓ తెలుగు హీరో కృతిశెట్టి తో ఐటమ్ సాంగ్ చేయించుకోవడానికి ఏకంగా ఆమెకు రెండు కోట్లు చెక్ ఇచ్చారట. అయితే కృతి శెట్టి మాత్రం ఐటమ్ సాంగ్ లో నటించను అంటూ తగ్గేసి చెప్పేస్తుందట .
అంతేకాదు రెండు కోట్లు కాదు ఐదు కోట్లు చెక్ ఇచ్చిన సరే నేను ఐటెం సాంగ్ చేయను అంటూ కరాకండిగా చెప్పేసింది. ఆమెకి ఐటెం సాంగ్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు . గతంలో చాలామంది ఆమెకు అలాంటి ఆఫర్స్ ఇచ్చిన రిజెక్ట్ చేసింది అంటూ మనం వార్తలు విన్నాం. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో ఇంటికి వచ్చి అవకాశాన్ని ఇచ్చినా రిజెక్ట్ చేసింది అంటే కృతి శెట్టి దగ్గర నుంచి ఇక్కడ లైఫ్ లో మనం ఐటెం సాంగ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటున్నారు అభిమానులు..!!