టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీబిజీగా ముందుకు వెళ్తున్నాడు. అంతేకాదు రీసెంట్ గానే సలార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు భారీ స్థాయిలో మేకర్స్ కి లాభాలు కూడా కురిపించింది ఈ సినిమా . త్వరలోనే సలార్ 2 కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు ..
ఆ తర్వాత స్పిరిట్.. ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . కాగా ఈ క్రమంలోనే ప్రభాస్ – త్రిషల మధ్య జరిగిన బిగ్ వార్ బయటపడింది . ఫస్ట్ నుంచి ప్రభాస్ -త్రిషలు జాన్ జిగిడి దోస్తులు అన్న ప్రచారం జరిగింది . వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తెరపై వీళ్ళ రొమాన్స్ కూడా బాగా వర్క్ అవుట్ అయింది . అయితే సడన్గా ప్రభాస్ – త్రిష విడిపోయారు.
దీనికి కారణం ఏంటా అంటూ చాలామంది చర్చించుకున్నారు. అయితే త్రిష క్యారెక్టర్ వేరు అని.. ప్రభాస్ మైండ్ సెట్ వేరు అని.. ప్రభాస్ చాలా సాఫ్ట్ మైండ్ అని త్రిష చాలా బోల్డ్ స్టెప్ తీసుకుంటుంది అని ..తనకు దక్కని వస్తువు మరి ఎవరికి దక్కకూడదు అనుకునే టైపు త్రిష మనస్తత్వం ఉంటుంది అని .. ప్రభాస్ తనకు దక్కకపోయినా పర్లేదు పక్కవాళ్ళైనా హ్యాపీగా ఉంటే చాలు అనుకునే టైపు అని ..ఇద్దరు కూడా అస్సలు మ్యాచ్ అవ్వరని.. ఆ కారణంగానే త్రిష చేసిన పనులు కొన్ని ప్రభాస్ మనసు ముక్కలు అయ్యేలా చేసేసాయని .. అందుకే వాళ్ళు విడిపోయారు అన్న ప్రచారం అప్పట్లో ఎక్కువగా జరిగింది ..సోషల్ మీడియాలో ఈ వార్త యమ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది..!!