శర్వానంద్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా స్టార్ హీరోలుగా మారి రాజ్యమేలుస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోగా శర్వానంద్ ఎప్పుడు తను స్థానాన్ని అలాగే ముందుకు తీసుకెళ్తూ వచ్చాడు . హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శర్వానంద్ .. ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ముందుకు వెళుతున్నాడు.
ఆయన రక్షితా రెడ్డి అనే ఆమెను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . వీళ్ళ పెళ్లి ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది . రీసెంట్గా వీళ్ళు పండు లాంటి పాపకు జన్మనిచ్చారు. ఆ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించాడు శర్వానంద్. పాప ఎప్పుడు పుట్టిందో డేట్ కరెక్ట్ గా చెప్పలేదు కానీ పాపతో కలిసి ఉన్న ఫొటోస్ ను షేర్ చేశారు . పాప – శర్వానంద్ – రక్షిత రెడ్డి బెడ్ పై పడుకొని ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ తనకు పాప పుట్టింది అన్న విషయం తన పుట్టినరోజు నాడు రివీల్ చేశారు.
అంతేకాదు తన పాపకు “లీలాదేవి మైనేని” అనే పవిత్రమైన పేరును కూడా పెట్టారు. ఈ మధ్యకాలంలో ఈ జనరేషన్ ఎలాంటి పేర్లు పెడుతుందో చూస్తూనే ఉన్నాం. నోటికి కూడా పలక లేనటువంటి పేర్లు పెట్టుకొస్తున్నారు . అయితే శర్వానంద్ మాత్రం చక్కగా ట్రెడిషనల్ గా అమ్మవారి పేరు పెట్టుకోవడం అందరికీ ఆశ్చర్యకరంగా ఉంది . ఇది ఇద్దరి అంగీకారంతోనే పెట్టారట . పాప పుట్టిన జాతకం ప్రకారం అమ్మ వారి పేరు కలిసి వచ్చేలా పెడితే పాపకి మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది అని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెత్తిన వైరల్ గా మారింది..!!