టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో వరుణ్ తాజాగా నటించిన సినిమా ఆపరేషన్ వాలెంటైన్ . మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో నవదీప్ ..రుహానీ శర్మ కీలకపాత్రలో కనిపించారు. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జే మేయర్ తనదైన స్టైల్ లో మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాను శక్తి ప్రతాప్ తనదైన స్టైల్ లో డైరెక్టర్ చేశాడు . కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమాపై జనాలు తమదైన స్టైల్ లో రివ్యూ ఇస్తున్నారు .
ఫైటర్ నిర్మాణం పై భారతీయ చిత్ర పరిశ్రమలు ఇప్పుడిప్పుడే దృష్టి సారిస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే వరుణ్ తేజ్ అలాంటి బిగ్ రిస్క్ చేయడం సాహసం అనే చెప్పాలి . తెలుగులో రూపొందిన తొలి ఏరియల్ యాక్షన్ చిత్రం ఇదే కావడం గమనార్హం. వరుణ్ తేజ్ ఫైటర్ పైలెట్ పాత్రలో ఎలా ఒదిగిపోయాడు..? ఈ సినిమాతో హిట్ పడిందా ..? లేదా..? అనేది ఇప్పుడు చదివి తెలుసుకుందాం..!!
అర్జున్ రుద్రదేవ్ అలియాస్ రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ లీనమైపోయినటించాడు . భారతీయ వైమానిక దళంలో స్క్వాడ్రన్ లీడర్..” ఏం జరిగినా చూసుకుందాం” అంటూ ధైర సాహసాలతో అడిగేసే టైప్ . భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ అంటారుగా ఆ విధంగా.. వైమానిక దళంలోనే పనిచేసే రాడర్ ఆఫీసర్ అపర్ణ గిల్ ..మానుషి చిల్లర్ తో ప్రేమలో ఉంటాడు . కొన్ని కారణాల చేత ఆయన తన పనికి దూరం కావాల్సి ఉంటుంది . ఆ తర్వాత ఆపరేషన్ వాలంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు.
ఆపరేషన్ అంటే ఏంటి ..? అసలు ఎందుకు రుద్ర తాన వర్క్ కి దూరంగా ఉండాల్సి వచ్చింది.? తన ప్రేమ ఎలా తన కెరీర్ ని మలుపు తిప్పింది..? అనేది తెరపై చూస్తేనే బాగుంటుంది. సినిమాలో ఎక్కడ ఓవర్ ఆక్టింగ్ లేదు. ఉన్నది ఉన్నట్లు బాగా తెరకెక్కించాడు డైరెక్టర్ . మరి ముఖ్యంగా ఈ సినిమాకి కర్త – కర్మ – క్రియ అంతా కూడా వరుణ్ తేజ కావడం గమనార్హం. తన నటన సూపర్ . మానసి చిల్లర్ ఎంతవరకు ఉండాలో అంతవరకే నటించింది.
కథ విషయంలో చాలా బాగా రాసుకున్న ఎందుకో తెరపై చూపించడానికి ఆ విషయంలో ఫ్లాప్ అయ్యాడు డైరెక్టర్ . అంతేకాదు కొన్ని కొన్నిచోట్ల ఎమోషన్స్ అంతగా పండలేదు. సినిమాలో మెయిన్ కీలక పాయింట్లు దేశభక్తి . వరుణ్ తేజ్ – మానూషి చిల్లర్ నటన ..విజువల్స్.. సూపర్ గా ఉంటాయి. దీనికోసం సినిమా చూడొచ్చు . మొత్తానికి ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఖచ్చితంగా ఒకసారి థియేటర్ కి వెళ్లి చూడదగ్గ సినిమా అంటున్నారు జనాలు. చూద్దాం మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?