నమ్రత శిరోద్కర్ .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఒక అప్పట్లో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ..కుర్రాళ్లను తన అంద చందాలతో ఉక్కిరిబిక్కిరి చేసిన అందాల ముద్దుగుమ్మ . ఒకటా..? రెండా..? అమ్మడు నటించిన సినిమాలు ఎన్ని హిట్ అయ్యాయో మనకు తెలిసిందే . అఫ్ కోర్స్ నమ్రత నటించిన సినిమాలు అటు ఇటు టాక్ దక్కించుకున్న .. ఆమె అందాలకు మాత్రం ఏనాడు నెగిటివ్ రిమార్క్ పడలేదు .
మరీ ముఖ్యంగా అంజి సినిమా పరమ చెత్త టాక్ సంపాదించుకున్న కూడా నమ్రత అందాలు ఓ రేంజ్ లో అల్లాడించేసాయి. అంతలా కుర్రాళ్లను ఆకట్టుకునింది నమ్రత శిరోద్కర్. ఎప్పుడైతే మహేష్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకొని ఘట్టమనేని ఇంటికి కోడలుగా అడుగుపెట్టిందో అప్పటినుంచి సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది .
అలా చేయడం చాలా చాలా కష్టమైన పని ..స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్ ఒక్కసారిగా అన్నిటికీ దూరం అవ్వాలి .. వదులుకోవాలి అంటే అది జరగని పని .. కానీ నమ్రత చేసింది ..దానికి కారణం ఆమెకు ఉన్న ఎక్స్పీరియన్స్ .. ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో భార్య సినిమాలు చేస్తే ఆ తర్వాత ఎలాంటి సిచువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఆమెకు బాగా తెలుసు. ఆ కారణంగానే నమ్రతా శిరోద్కర్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయిందట . పెళ్లి తర్వాత కొన్ని కోట్లు ఇచ్చే ఆఫర్లు వచ్చిన సరే ఆమె ఏ సినిమాకి సైన్ చేయకపోవడం మహేష్ బాబు కూడా ఆమె నిర్ణయానికి కట్టుబడి ఉండడం అభిమానులకి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది..!!