అక్కినేని నాగార్జున టాలీవుడ్ ఇండస్ట్రీలో కింగ్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా మన్మధుడిగా బాగా అమ్మాయిల కలల రాకుమారుడిగా రాజ్యమేలేశాడు . ప్రజెంట్ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో ముందుకు వెళ్తున్న అక్కినేని నాగార్జున గతంలో ఇండస్ట్రీలో ఎలాంటి హిట్ సినిమాలకు హీరోగా చేశాడో మనకు తెలిసిందే. అప్పట్లో ఆయన నటించిన సినిమాలు చాలా చాలా బాగా ఆడేటివి. అభిమానులు కూడా ఆయన సినిమాలను బాగా ఎంకరేజ్ చేసే వాళ్ళు .
అయితే ఒకానొక టైంలో నాగార్జునకు వరుసగా అన్ని ప్లాప్ సినిమాలు పడ్డాయి . ఆ టైంలో చాలామంది నాగార్జునను ఇబ్బందికర మాటలతో ఇబ్బంది పెట్టారు. ఇక నాగార్జున కెరియర్ ఖతమ్ అనుకున్నారు. అయితే అలాంటి టైం లోనే ఒక సినిమా నాగార్జున చేతిలోకి వచ్చింది. పాపం నాగర్జున అన్నగారు వెంకట్..” వద్దురా సినిమా చేయొద్దు” అంటూ ఎంత బ్రతిమిలాడినా సరే ఆ సినిమా చేశాడు .
సీన్ కట్ చేస్తే ఆ సినిమా చేసిన తర్వాత నాగార్జున కెరియర్ మరింత డౌన్ ఫాల్ అయింది . ఆ సినిమా మరేదో కాదు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన గోవిందా గోవిందా . ఆల్రెడీ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగర్జున హీరోగా వచ్చిన శివ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో . రామ్ గోపాల్ వర్మ పై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని గుడ్డిగా నమ్మేసి ఛాన్స్ ఇచ్చాడు నాగార్జున . అయితే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . ఈ సినిమా తర్వాత హిట్ కొట్టడానికి చాలాకష్టపడ్డాడు నాగార్జున . అలా అన్న చెప్పిన మాట వినకుండా కెరియర్ లో చాలా చాలా తిప్పలు ఫేస్ చేశాడు అక్కినేని నాగార్జున..!