టాలీవుడ్ లవర్ బాయ్ గా పేరు సంపాదించుకున్న సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడూ డేటింగ్ లో మునిగితేలుతూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాడు సిద్ధార్థ్. ఇక సిద్ధార్థ్ కి గతంలో మ్యారేజ్ అయ్యి విడాకులు అయిన సంగతి మనకి తెలిసిందే. ఇక తాజాగా హీరోయిన్ అయిన అదితి రాయ్ ని సిద్ధార్థ్ మ్యారేజ్ చేసుకున్నాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరూ తాజాగా ఓ గుడిలో వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది. మార్చ్ 27న తెలంగాణలోని వనపర్తి లో రంగనాయక స్వామి ఆలయంలో వీరిద్దరి పెళ్లి జరిగినట్లు తెలుస్తుంది.
ఇరు కుటుంబాల పెద్దలు మరియు అత్యంత కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇక వీరిద్దరూ కూడా తమ పెళ్లి వార్తలపై ఏ మాత్రం స్పందించలేదు. తమిళనాడు కి చెందిన పురోహితులు వీరిద్దరి వివాహాన్ని హిందూ ఆలయాల ప్రకారం జరిపించినట్లుగా సమాచారం. ఇక వీరిద్దరికీ సంబంధించిన పెళ్లి ఫొటోస్ సైతం బయటికి రాలేదు. కానీ నిన్న జరిగిన హిరామండి మూవీ ప్రమోషన్స్ లోనూ ఆదితి కనిపించలేదు. దీంతో ఈ వార్తలో నిజం ఉందని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. 2021 లో విడుదలైన మహాసముద్రం మూవీలో సిద్ధార్థ్, అదితి కలిసి నటించారు. ఇక ఇందులో మరో హీరో కూడా ఉన్నాడు. అతనే శర్వానంద్. ఇక ఈ మూవీ సమయంలోనే సిద్ధార్థ్ మరియు అదితి ప్రేమలో పడినట్లు తెలుస్తుంది.
ఈ మూవీ చిత్రీకరణ సమయంలో జరిగిన పరిచయమే అనంతరం ప్రేమగా మరీ ప్రస్తుతం పెళ్లిగా మారింది. కొన్నేళ్లుగా వీరి ప్రేమ పై అనేక రూమర్స్ వస్తూనే ఉన్నప్పటికీ వాటిపై వీరిద్దరూ స్పందించలేదు. ప్రస్తుతం వీరి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరిద్దరిపై ఆరా తీయడం మొదలుపెట్టారు. వీరిద్దరి వయసు ఎంత? అనే దానిపై చర్చ జరుగుతుంది. అదితి కంటే సిద్ధార్థ్ దాదాపు 7 సంవత్సరాలు పెద్దవాడు. అదితి 1986న అక్టోబర్ 28న హైదరాబాద్లో జన్మించింది. ఇక సిద్ధార్థ్ 1979 ఫిబ్రవరి 17న చెన్నైలో జన్మించాడు. అలా వీరిద్దరికీ ఏడు సంవత్సరాలు ఏజ్ గ్యాప్ వచ్చింది. ఇక గతంలో వీరిద్దరికీ కూడా విడివిడిగా వివాహాలు అయ్యాయి. ఇక వివాహాలు కాస్త బిడిసి కొట్టడంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ పెళ్లి చేసుకుని ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చారు. మరి వీటిపై ఇటు అదితి అటు సిద్ధార్థ్ ఎప్పుడు స్పందిస్తారో చూడాలి..!