కొంతమంది అబ్బాయిలకి అమ్మాయిలు విషయంలో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రిస్క్రిప్షన్స్ కూడా ఉంటాయి . కొంతమంది మోడరన్ డ్రెస్సెస్ వేస్తే ఇష్టపడరు. మరి కొంతమంది పద్ధతిగా ఉండాలి అంటూ ఉంటారు. మరి కొంతమంది అమ్మాయిలు పార్ష్ గా ఉంటే లైక్ చేయరు . అలా ఒక్కొక్క అబ్బాయికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది . ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు కి కూడా అదే లక్షణాలు ఉన్నాయి . తాజాగా ప్రభాస్ కి సంబంధించిన ఓ విషయం బయటపడింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ కి అమ్మాయిలు గోర్లు పెంచుకుంటే నచ్చదట. ఆడవాళ్ళు దయ్యంలా గోర్లు పెంచుకోవడం ఏంటి..? అంటూ వాళ్ళ సిస్టర్స్ ని కూడా అరుస్తూ ఉంటాడట . ప్రభాస్ కి చాలా సింపుల్ గా ఉండడమే ఇష్టమట . చిట్టి పొట్టి బట్టలు వేసుకొని ఎక్స్పోజ్ చేస్తూ తిరుగుతూ ఉండడం నచ్చదట . చక్కగా చీర కట్టుకోవడం లేదా చుడీదార్ వేసుకోవడం జడ వేసుకొని పూలు పెట్టుకోవడం లాంటివి ఇష్టమట.
ఎవరైనా సరే తన కళ్ళ ముందు అమ్మాయి నేయిల్స్ పెంచుకొని కనిపించిన సరే చిరాకు పడిపోతారట. మొదటి నుంచి సిగ్గు, మొహమాటం కల ప్రభాస్ ఆ విషయాన్ని వాళ్ళకి ఓపెన్ గా చెప్పలేదట . తనకు క్లోజ్ అయిన అమ్మాయిలకు మాత్రం ముఖాన్నే చెప్పేస్తారట . అందుకే వాళ్ళ చెల్లెలు ప్రభాస్ కి ఇష్టం లేదు అని తెలిసి నేయిల్స్ కూడా పెంచుకోరట. ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు ప్రభాస్ . త్వరలోనే స్పిరిట్ సినిమాని కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సందీప్ రెడ్డివంగా అఫీషియల్ గా ప్రకటించాడు..!!