సాయి పల్లవి.. సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ . పేరుకి మలయాళీ బ్యూటీని కానీ తెలుగులో మాత్రం అమ్మడి ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే బుర్ర గిర్రు గిర్రు మంటూ తిరగాల్సిందే . ఒకటా రెండా వేల కోట్ల మంది ఇష్టపడుతుంటారు . ఆఫ్ కోర్స్ ఆమెను బూతులు తిట్టే జనాలు కూడా ఉన్నారు . అయితే సాయి పల్లవి పాజిటివ్ కామెంట్స్ ని తీసుకోరు ..నెగిటివ్ కామెంట్స్ ని తీసుకోదు రెండిటిని ఒక చెవితో విని ఒక చెవితో వదిలేస్తుంది .
అందుకే ఆమె లేడి పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకోగలిగింది. రీసెంట్గా సాయి పల్లవికి సంబంధించిన ఒక న్యూస్ నెట్టీంట వైరల్ గా మారింది. హీరోయిన్ సాయి పల్లవి రెమ్యూనరేషన్ విషయంలో చాలా లైట్ గా ఉంటుంది అని అందరికీ తెలిసిందే . మిగతా హీరోయిన్స్ ఆరు కోట్లు ఏడు కోట్లు అంటుంటే సాయి పల్లవి కోటి రెండు కోట్లతో సరిపెట్టుకుంటుంది . అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయి పల్లవి రెమ్యూనరేషన్ గురించి సంచలన కామెంట్స్ చేసింది .
“నేను రెమ్యూనరేషన్ గురించి ఆలోచించను. సినిమా కథ కంటెంట్ గురించి ఆలోచిస్తాను . సినిమా హిట్ అయితే మనం వద్దన్నా మేకర్స్ పిలిచి డబ్బులు ఇస్తారు ..మరి నాకు రెమ్యూనరేషన్ గురించి దిగులు ఎందుకు? నా పాత్రకు తగ్గ రెమ్యూనరేషన్ మేకర్స్ ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంటారు.. నేను రెమ్యూనరేషన్ డిమాండ్ చేయాలి అంటే ఆ పాత్ర నేను చేయలేనటువంటిది నాకు కష్టమైనటువంటిది అయి ఉండాలి.. అలాంటి పాత్రలు ఇప్పటివరకు నాకు ఎదురవ్వలేదు .. అందుకే నేను ఏ మూవీకి రెమ్యూనరేషన్ డిమాండ్ చేయలేదు” అంటూ చెప్పుకు వచ్చింది . ఈ మాటలతో మరొకసారి అందరి మనసులను కొల్లగొట్టింది సాయి పల్లవి..!!