Movies"వాళ్లపై రివేంజ్ తీర్చుకోవడానికి సమంత ఆ పని చేసిందా..?" ఇంత ఓపెన్...

“వాళ్లపై రివేంజ్ తీర్చుకోవడానికి సమంత ఆ పని చేసిందా..?” ఇంత ఓపెన్ గా చెప్పేసింది ఏంటి..!

సమంత .. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురైన పేరు . అంతకుముందు స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రిని ఏలేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చేతిలో అవకాశాలు లేక వెయిట్ చేసే స్థాయికి వచ్చేసింది అంటే కారణం ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు . కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకోవడం ..అంతా బాగున్న టైంలోనే నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం .. ఆ తర్వాత మయోసైటీస్ వ్యాధికి గురవడం .. ఆ తర్వాత ఆమెకు సంబంధించిన కొన్ని అసభ్యకర ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం .. ఇలా బ్యాక్ టు బ్యాక్ సమంత కెరీర్ ని పాతాళానికి పడిపోయేలా చేసింది .

మళ్ళీ ఎలాగోలా తన కెరీర్ ని సెట్ చేసుకోవడానికి నానాతంటాలు పడుతుంది సమంత . రీసెంట్గా సమంత ఇండియా టుడే మీట్ లో పాల్గొనింది . ఈ క్రమంలోనే పలు ఆసక్తికర విషయాలపై స్పందించింది. ఇదే మూమెంట్లో హోస్ట్ “పుష్ప మూవీలో మళ్లీ మీరు ఊ అంటావా మామ సాంగ్ చేస్తారా..?” అన్న ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది . ఈ ఒక్క ఆన్సర్ తో అభిమానుల మైండ్ బ్లాక్ అయిపోయేలా చేసింది .

“కెరియర్ లో మళ్ళీ మళ్ళీ అలాంటి సాంగ్ చేయను.. ఆ సాంగ్ చేసే టైంలో నేను చాలా డిస్టర్బ్ గా ఉన్నాను ..వణికి పోయాను .. సెక్సీ అనేది తనకు సరిపడదని అందుకే తాను అలా ఫీల్ అయినట్లు చెప్పుకొచ్చింది . అంతేకాదు ఆ టైంలో ఆ పాటలో లిరిక్స్ నాకు బాగా కనెక్ట్ అయ్యాయి.. అందుకే ఆ పాట చేయడానికి ఒప్పుకున్నాను.. ఇక లైఫ్ లో అలాంటి పాట మళ్ళీ చేయను నా లైఫ్ లో ఆ పాట ఎప్పటికీ మర్చిపోలేను “అంటూ చెప్పుకొచ్చింది .

పరోక్షంగా సమంత కొందరిని టార్గెట్ చేస్తూ ఆ పాట చేసింది అని చెప్పకనే చెప్పేసింది అంటున్నారు సామ్ ఫ్యాన్స్ . అంతేకాదు ఐటెం సాంగ్ చేయకపోతే పర్లేదు కానీ సినిమాలైనా చేయమంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు సమంత అభిమానులు. ఆమె పలు సినిమాలను నిర్మించడానికి కూడా సిద్ధపడింది. అయితే ఇప్పటివరకు తెలుగులో ఒక్క సినిమాకు కూడా కమిట్ కాకపోవడం సమంత అభిమానులకు కొత్త టెన్షన్లు పుట్టిస్తుంది . చూద్దాం మరి సమంత ఫ్యూచర్లో ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో..???

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news