టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రెసెంట్ గేమ్ చేంజర్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే . రీసెంట్ గానే ఆ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ని కంప్లీట్ చేసుకున్నాడు . దీంతో తర్వాతే సినిమాను సెట్స్ పైకి తీసుకురావడానికి ప్లాన్ చేశాడు. రీసెంట్గా ఆయన కమిట్ అయిన బుచ్చిబాబు సనా దర్శకత్వంలోని మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు .
ఈ వేడుకకు చిరంజీవి కూడా హాజరు కావడం గమనార్హం . కాగా కొద్దిసేపటి క్రితమే ఈ పూజా కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి . దీనికి సంబంధించిన పిక్చర్స్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . కాగా ఇదే క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న జాన్వి కపూర్ సైతం పూజా కార్యక్రమాలకు హాజరైంది. గ్రీన్ కలర్ శారీలో చాలా అందంగా చక్కగా కనిపించింది .
అయితే జాన్వి కపూర్ సారీ ని హ్యాండిల్ చేయలేని క్రమంలో చీర కొంగు కాళ్ళకి అడ్డుపడుతున్న మూమెంట్లో చరణ్ ఆమెకు హెల్ప్ చేయడం అక్కడుండే వారికి ఆశ్చర్యకరంగా అనిపించింది. నిజానికి వీళ్లు డైరెక్ట్ గా మీట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం..వాళ్ళిద్దరూ క్లోజ్ గా మాట్లాడుకున్నా పిక్చర్స్ వాళ్ళు మెలుగుతున్న తీరు మంచి ఫ్రెండ్స్ అని ప్రూవ్ చేస్తున్నాయి . దీనితో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది. గ్రీన్ కలర్ శారీలో కుందనపు బొమ్మలా కనిపించింది జాన్వి కపూర్ . ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుంది . ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంది అని ఆ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ కృటి సనన్ చూస్ చేసుకున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!!