ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . రీసెంట్ గానే అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి తమ పెళ్లిరోజును ఘనంగా జరుపుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంత అన్యోన్యంగా ఉంటుందో తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది రొమాంటిక్ కపుల్ గా పాపులారిటి సంపాదించుకున్నారు ఈ జంట. ఎప్పటికప్పుడు ట్రెండీ అవుట్ ఫిట్స్ లో మెరిసిపోయే బన్నీ స్నేహ రెడ్డిలు పెళ్ళి రోజుకు విష్ చేసుకున్న పద్ధతి కూడా అభిమానులకు బాగానే నచ్చేసింది.
బన్నీ తన సతీమణిని పొగుడుతూ 13వ మ్యారేజ్ యానివర్సరీ రోజున బ్యూటిఫుల్ పిక్స్ కూడా పోస్ట్ చేశారు . కాగా ఇలాంటి క్రమంలోనే వీళ్ళకి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమా ఈవెంట్లో అల్లు అరవింద్.. బన్నీ ఎవరిని ప్రేమిస్తే ఆ అమ్మాయినే పెళ్లి చేస్తామంటూ ప్రకటించాడు . ఆ మరుసటి ఏడాది 2011లో బన్నీ – స్నేహాల వివాహం జరిగింది .
ఇది అప్పట్లో సెన్సేషన్ గా మారింది. అయితే సమంత హోస్ట్ చేస్తున్న ఓ షో కి గెస్ట్ గా వచ్చిన ఆయన..తన లవ్ స్టోరీని బయటపెట్టడం అందరికి ఆశ్చర్యకరంగా అనిపించింది. నిజానికి బన్ని తన లవ్ స్టోరీ ని ఎక్కడ రివీల్ చేయలేదు . కేవలం సమంత అడిగింది అన్న కారణంగానే తన లవ్ స్టోరీని సమంత ముందు బయట పెట్టాడు . “సాధారణంగా నైట్ క్లబ్ లో అమ్మాయిలను చూస్తే ఏదో ఏదో అనుకుంటారని.. కానీ స్నేహ చాలా డిగ్నిటి గల మనిషి అని ఎక్కడా కూడా స్నేహ తన లిమిట్స్ క్రాస్ చేయదు అని అదే తన నాకు నచ్చిన బాగా మంచి క్వాలిటీ అని చెప్పుకొచ్చాడు”.
” అంతే కాదు కొన్ని కొన్ని విషయాలలో నేను స్నేహ రెడ్డి ఒకటి అంటూ కూడా చెప్పుకొచ్చాడు. దీంతో సమంత ని బన్నీ ఎంత బాగా నమ్ముతాడు అనే విషయం అప్పట్లో బాగా వైరల్ అయింది “. అంతేకాదు అల్లు అర్జున్ కి స్నేహ రెడ్డి అంటే ఎంత ప్రాణం అనే విషయం కూడా జనాలకు అర్థమైంది . ప్రెసెంట్ బన్నీ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు..!!