ఈ మధ్యకాలంలో సినీ స్టార్స్ తమ మనసులోని విషయాలను కోపంగా చెప్పడం మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా కొంతమంది యంగ్ స్టర్స్ అయితే బోల్డ్ గా కూడా మాట్లాడేఅస్తున్నారు . తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా కొనసాగుతున్న కిచ్చా సుదీప్ డాటర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరోస్ కి కూడా ఆమె మాటలు జలసిని క్రియేట్ చేస్తున్నాయి.
కన్నడ సినీ పరిశ్రమతో సహా ఇతర భాషల సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న కిచ్చా సుదీప్ కూతురు.. శాన్వి రీసెంట్ గా అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె తన మనసులోని విషయాన్ని బయటపెట్టింది. ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ పై తనకున్న క్రష్ ని బయట పెట్టేసింది .
“నాకు అల్లు అర్జున్ అంటే చాలా చాలా ఇష్టం .. ఆయనతో కలిసి ఒక్క ఫోటో దిగే అవకాశం వస్తే చాలు అనుకుంటున్నాను.. ఏదైనా సినిమాలో చిన్న పాత్రలో నటించిన నా జన్మ ధన్యం.. ఆ అవకాశం వస్తే నా జీవితానికి అంతకంటే అదృష్టం మరొకటి లేదు ” అంటూ బన్నీపై ఉన్నటువంటి తన అభిమానాన్ని చాటుకున్నింది. దీనితో బన్నీ ఫ్యాన్స్ ఈ స్క్రీన్ షాట్ ను ట్రెండ్ చేస్తున్నారు..!!