సోషల్ మీడియాలో స్టార్ హీరోస్ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉండడం సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వార్ ఓ రేంజ్ లో జరుగుతుంది . రీసెంట్ గా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య ఫ్యాన్స్ వార్ పీక్స్ కు చేరింది .
రీసెంట్ గానే అల్లు అర్జున్ ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు . ఇంస్టాగ్రామ్ లో ఇప్పటివరకు ఏ స్టార్ హీరో అందుకోని అటువంటి ఒక మైలురాణి దాటాడు. ఫాలోవర్స్ సంఖ్య 25 మిలియన్లు దాటేసింది . సౌత్ ఇండియాలో ఏ హీరో బద్దలు కొట్టలేని రికార్డ్ క్రియేట్ చేశాడు అల్లు అర్జున్ . అయితే ఇక్కడే చరణ్ ఫాన్స్ కు ఘాటుగా కొందరు కౌంటర్స్ వేశారు కొందరు ఫ్యాన్స్.
” ప్రతి విషయంలో మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని చెప్పుకోవడం కాదు.. రియల్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఇలా ఉంటుంది .. మీ హీరో 21 మిలియన్ల దగ్గరే ఆగిపోయాడు ..మా హీరో 25 మిలియన్లు క్రాస్ చేసేసాడు ..అది రియల్ ఫ్యాన్ అంటే అంటూ ఓ రేంజ్ లో గొడవలు వేసుకుంటున్నారు”. అయితే చరణ్ ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ అభిమానులకు ధీటైన కౌంటర్స్ ఇస్తున్నారు. పుష్ప2సినిమా హిట్ అయితే అప్పుడు చూద్దాం అంటూ ఓపెన్ గా సవాల్ చేస్తున్నారు. దీంతో చరణ్ – బన్నీ ఫ్యాన్స్ మధ్య కొత్తవార్ స్టార్ట్ అయింది..!!