Moviesపెళ్లైన మూడు నెలలకే ఇంత మారిపోయావా వరుణ్..? పబ్లిక్ లో భార్య...

పెళ్లైన మూడు నెలలకే ఇంత మారిపోయావా వరుణ్..? పబ్లిక్ లో భార్య గురించి ఏం మాట్లాడాడో చూడండి..!

సినిమా ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ కు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . మరి ముఖ్యంగా అమ్మాయిలు ఆయన హైట్ అంటే పడి చచ్చిపోతూ ఉంటారు. రీసెంట్ గానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా పేరు సంపాదించుకున్న వరుణ్ పెళ్లి చేసుకునేసాడు . హీరోయిన్ లావణ్య త్రిపాఠిను ఇటలీలో గ్రాండ్గా పెళ్లి చూసుకొని తన వైఫ్ గా మెగా ఇంటికి కోడలుగా మార్చేశాడు . వీళ్ళకి సంబంధించిన పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి.

మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నాడు . మార్చి 1న ఈ సినిమా విడుదల కాబోతుంది . తాజాగా ఈ సాంగ్ రిలీజ్ వేడుకలో తన భార్యపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మార్చి ఒకటిన ఈ సినిమా రిలీజ్ కాబోతూ ఉండడంతో రీసెంట్గా సాంగ్ రిలీజ్ చేశారు . మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో స్టూడెంట్స్ చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. స్టూడెంట్ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానం చెప్పాడు .

ఈ క్రమంలోనే బాబాయ్ తో సినిమా ఎప్పుడు చేస్తున్నారు ..? అని ఓ స్టూడెంట్ అడగ్గా త్వరలోనే.. వెయిట్ చేస్తున్నాను అంటూ క్రేజీ ఆన్సర్ ఇచ్చారు. మరొక స్టూడెంట్ ” మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు..?” అని అడగ్గా..” నా ఫేవరెట్ హీరోయిన్ ఎవరో మీ అందరికీ తెలుసు.. ఆల్రెడీ పెళ్లి చేసుకునేసాను ..ప్రెసెంట్ నా ఇంట్లోనే ఉంది” అంటూ నాటి ఆన్సర్ ఇచ్చారు. అంతేకాదు లావణ్య త్రిపాఠి కాకుండా వరుణ్ కి ఇష్టమైన హీరోయిన్ ఎవరు..? అంటూ మరొక స్టూడెంట్ ప్రశ్నించింది . దీనికి ఆన్సర్ చెప్తూ సాయి పల్లవి అంటాడు. ప్రజెంట్ వరుణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి .

నిన్న మొన్నటి వరకు ఎక్కడికెళ్ళినా సరే వరుణ్ – లావణ్య పేరు ఎత్తకుండానే మాట్లాడేందుకు జాగ్రత్త పడ్డాడు. ఎప్పుడైతే పెళ్లి అయిపోయిందో అప్పటినుంచి ఆయన ఎక్కడికి వెళ్లినా సరే లావణ్య త్రిపాఠి పేరు కచ్చితంగా అక్కడ వినిపిస్తుంది . ఈ క్రమంలోనే అందరిలాగే వరుణ్ కూడా మారిపోయాడు అంటూ కుర్రాళ్ళు నాటీ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news