మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ కేవలం సినిమాలో నటించడం ద్వారానే కాదు .. పలు బిజినెస్ ల ద్వారా పలు యాడ్స్ లో నటించడం ద్వారా.. పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయడం ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు . కొందరికి ఇది ఓ వ్యసనం లా ఉంటుంది . సినిమాలో నటిస్తూ ఎన్ని కోట్లు సంపాదించిన సరే అరా కొరా యాడ్స్ లో నటిస్తూ డబ్బులు సంపాదించుకోవడం ఒక హాబీ .
మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అలాంటి హీరో హీరోయిన్లు ఉన్నారు . ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇంస్టాగ్రామ్ ద్వారా భారీ స్థాయిలో సంపాదించడానికి ట్రై చేస్తున్నారు స్టార్ సెలబ్రిటీస్ . వాళ్ళు పెట్టే ఒక్కొక్క పోస్టు మిలియన్ వ్యూస్ తగ్గించుకుంటూ ఉండటంతో వాళ్లకి ఆదాయం లక్షల్లో కొంతమందికి కోట్లలోనే ఉంటుంది . వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!
సమంత : టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంతకు 30 మిలియన్లకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఒక్క పోస్టు పెడితే 50 – 70 లక్షల రూపాయల వరకు సంపాదించుకుంటుందట .
రష్మిక : నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నాకు కూడా సోషల్ మీడియాలో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె పెట్టే పోస్టులకు గాను ఆమె నెలకు 30 నుంచి 50 లక్షల వరకు పారితోషకంగా అందుకుంటుందట .
కాజల్ అగర్వాల్: పెళ్లి అయ్యి కొడుకు పుట్టిన సరే తన హాట్ ఫిగర్ తో సోషల్ మీడియాని సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న కాజల్ ఇంస్టాగ్రామ్ లో బాగా యాక్టివ్ గా ఉంటుంది. పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూ ఉంటుంది. కాజల్ కూడా ఒక్కొక్క పోస్టుకు భారీగానే ఛార్జ్ చేస్తుందట . మొత్తానికి నెలకు 50 లక్షల రూపాయలకు పైగానే ఇంస్టాగ్రామ్ ద్వారా సంపాదన అందుకుంటుందట .
విజయ్ దేవరకొండ : టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్రేజీయస్ట్ రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరో ఒక్క ప్రోడక్ట్ ను ప్రమోట్ చేస్తే ఏకంగా కోటి రూపాయలు అందుకుంటాడట . మహేష్ బాబు ఎంత యాక్టివ్ గా ఉంటాడో మనందరికీ తెలిసిందే . సోషల్ మీడియా ద్వారా ఏదైనా ప్రమోట్ చేయాలి అనుకుంటే దాదాపు రెండు నుంచి మూడు కోట్ల వరకు పారితోషకంగా పుచ్చుకుంటారట. వీళ్లే కాదు చాలామంది స్టార్ హీరోస్ హీరోయిన్స్ కూడా ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు..!!