Moviesసుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు మిస్ చేసుకున్న మూడు సినిమాలు ఇవే..అన్ని...

సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు మిస్ చేసుకున్న మూడు సినిమాలు ఇవే..అన్ని సూపర్ హిట్లే..!!

కొన్ని కొన్ని సార్లు మనకి టైం అడ్జస్ట్ అవ్వని కారణంగా కావచ్చు లేక కథ నచ్చని కారణంగా కావచ్చు ..మరి ఏ రీజన్ అయినా కావచ్చు.. సినిమా ఇండస్ట్రీలో మనం కొన్ని సినిమాలను మిస్ అవ్వాల్సి ఉంటుంది . ఆ సినిమాలు హిట్ అవుతాయి అని తెలిసిన చేతులారా వదులుకోవాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అయితే అదే లిస్టులోకి వస్తాడు మన మహేష్ బాబు . కెరియర్ లో ఎన్నో సినిమాలను ఆయన హిట్ అవుతాయి అని తెలిసిన వదులుకున్నాడు .

మరీ ముఖ్యంగా సుకుమార్ మహేష్ బాబు కాంబోలో మిస్సయిన మూడు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ తన కెరీయర్ని మలుపు తిప్పిన సినిమా అంటే ఆర్య . ఈ సినిమాలో మొదటగా హీరోగా మహేశ్ ని అనుకున్నారట. ఆయన ఆయన వన్ సైడ్ లవ్ స్టోరీ అని తెలియడంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశారట .

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . బన్నీ కెరియర్ లో ఎవర్ గ్రీన్ హిట్ సినిమాగా నిలిచిపోయింది . రంగస్థలం .. చరణ్ కెరీర్ని మలుపు తిప్పిన సినిమా రంగస్థలం . ఈ సినిమాలో కూడా మొదటగా హీరోగా మహేష్ బాబును అనుకున్నారట. అయితే మహేష్ ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటి క్యారెక్టర్ అని తెలిసి రిజెక్ట్ చేశారట . ఈ సినిమా ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే. మూడో సినిమా పుష్ప .పాన్ ఇండియా లెవెల్ లో బన్నీ రికార్డులను క్రియేట్ చేసేలా చేసింది ఈ మూవీ . ఈ సినిమాలో మహేష్ బాబుని హీరోగా అనుకున్నాడట సుకుమార్. మాస్ కథ కావడంతో మహేష్ రిజెక్ట్ చేశాడు . ఇప్పుడు ఇదే సినిమాతో గ్లోబల్ అవార్డును కూడా దక్కించుకోబోతున్నాడు అల్లు అర్జున్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news