టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ కు ఒక కూతురు పుట్టిన విషయం అందరికి తెలిసిందే. పెళ్లయిన 11 ఏళ్లకు వీళ్ళకు పాప జన్మించింది. ఈ 11 ఏళ్ళు వీళ్ళు సోషల్ మీడియాలో ఎంతో ట్రోలింగ్ ఎదుర్కొన్నారు . కానీ ఉపాసన – రాంచరణ్ ఏనాడు బాధపడలేదు. ఫైనల్లీ రాంచరణ్ – ఉపాసన ..క్లింకారకు తల్లిదండ్రులు అయ్యారు. మెగా ఫామిలీ లోకి వచ్చాక మెగా ఫ్యామిలీ లో కొత్త కళ వచ్చింది అంటూ మెగాస్టార్ చెప్పుకు వచ్చారు .
వరుణ్ తేజ్ కి పెళ్లి అయింది అన్నా.. పుష్ప సినిమాకుగాను ఉత్తమ జాతీయ అవార్డు బన్నీ అందుకున్నాడు అన్నా.. పద్మ విభూషణ్ అవార్డ్ చిరంజీవికి వచ్చింది అన్నా.. కారణం క్లిం కార అనే అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు . అఫ్కోర్స్ క్లింకార పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీ కు బాగా కలిసి వచ్చింది . ప్రెసెంట్ క్లింకార పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దానికి కారనం లేకపోనూ లేదు.
రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..ఉపాసన క్లిం కార ను ..కారా అని పిలుస్తాము అంటూ పరోక్షకంగా చెప్పేసింది. దీంతో ఇదే ఆమె ముద్దు పేరు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . క్లిం కార ముద్దు పేరు చాలా క్యూట్ గా ఉంది అని అందరిలాగా.. హనీ, పప్పీ అంటూ లేకుండా అసలు పేరు నే ముద్దు పేరుగా పిలుచుకోవడం ఇంకా ఇంకా బాగుంది అని చెప్పుకొస్తున్నారు మెగా ఫ్యాన్స్..!