లైఫ్ లో మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ తీసుకునే కొన్ని నిర్ణయాలు కెరీయర్ని నాశనం చేయడమే కాకుండా వాళ్ళ జీవితాన్ని బలి తీసుకుంటూ ఉంటాయి . అలాంటి లిస్టులోకే వస్తాడు ప్రేమికుల రోజు హీరో కునాల్ సింగ్. ఈ పేరు చెప్తే పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు ఏమో కానీ పిక్చర్ చూస్తే మాత్రం బాగా గుర్తుపట్టేస్తారు . ప్రేమికుల రోజు సినిమాతో స్టార్ హీరోగా మారిపోయిన కునాల్ అమ్మాయిల ఫేవరెట్ హీరోగా నిలిచిపోయాడు .
కునాల్ నటించిన తొలి సినిమా కాదల్ దినం . ఈ మూవీని తెలుగులో ప్రేమికుల రోజు పేరిట డబ్ చేశారు . సోనాలి బింద్రే హీరోయిన్గా నటించిన ఈ సినిమాకి మ్యూజిక్ హైలెట్గా మారింది . అంతేకాదు ప్రేమికులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది .వాలు కనులదానా.. ప్రేమ అనే పరీక్ష రాసి ..దాండియా ఆటలు ఆడ ..ఇలా ఒకటా రెండా సినిమాలో ఉన్న పాటలు అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి . ఇప్పటికి మనం ఈ పాటలను మన మొబైల్లో వింటున్నామంటే కారణం డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అనే చెప్పాలి .
మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న కునాల్ సింగ్ ఆ తర్వాత ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయన జీవితాన్ని నాశనం చేసేసాయి . 2007లో చివరిగా నమ్మిన కాదలై అనే సినిమాలో యాక్ట్ చేశాడు . ఆ తర్వాత ఆయనకి తన పరిస్థితి అర్థం అయ్యి,, అసిస్టెంట్ డైరెక్టర్ గా మారాడు..సినిమాలు కూడా నిర్మించాడు. నటి లవీనా పంకజ్ భాటియా తో అత్యంత సన్నిహితంగా మెదిలే వాడు అని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి .
అప్పటికే ఆయనకు పెళ్లయింది . ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు . అయినా సరే కునాల్ ఎందుకు అలా చేశాడో ఆయనకే తెలియాలి . ఆ కారణంగానే వాళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు అయ్యేటివట . దీంతో ఆమె ఇల్లు విడిచి వెళ్లిపోవడంతో కునాల్ మనస్థాపానికి గురైయ్యాడు అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది . 2008 ఫిబ్రవరి 7న అపార్ట్మెంట్లో ఉరివేసుకొని చనిపోయాడు కునాల్ సింగ్. ఆయన లైఫ్ అందరికి ఒక గుణపాఠం. లైఫ్ లో మంచి నిర్ణయాలు తీసుకోకపోతే బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవడం పక్క అనే విధంగా కునాల్ అందరికీ ఒక గుణపాఠం నేర్పించాడు..!!