Moviesఫ్యాన్స్ కి తీపి కబురు.. తల్లి కాబోతున్న రామ్ చరణ్ ఫేవరేట్...

ఫ్యాన్స్ కి తీపి కబురు.. తల్లి కాబోతున్న రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా స్టార్ హీరో హీరోయిన్ కి సంబంధించినటువంటి వార్తలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు జనాలు . ఈ క్రమంలోనే రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వార్త అభిమానులకి బాగా నచ్చేసింది . బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న కియరా అద్వానీ రీసెంట్ గానే తాను ప్రేమించిన అబ్బాయ్ బాలీవుడ్ బడా హీరో సిద్ధార్ధ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది . బాలీవుడ్ లోనే అత్యంత కాస్ట్లీ వెడ్డింగ్స్ లో వీళ్ళ పెళ్లి కూడా ఒకటి . పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్ లో ప్రొఫెషనల్ లైఫ్ లో బాగా ఎంజాయ్ చేస్తున్న కీయార – సిద్ధార్ధ్ త్వరలోనే తమ మొదటి బిడ్డకు ఆహ్వానం పలకపోతున్నారు అన్న వార్త ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. కీయరా అద్వానీ ప్రెగ్నెంట్ అంటూ తెలుస్తుంది .

రీసెంట్గా హాస్పిటల్ కి చెకప్ కి కూడా వెళ్లిందట. ఈ క్రమంలోనే హాస్పిటల్ ఇన్సైడ్ వర్గాల నుంచి ఈ న్యూస్ లీకై వైరల్ గా మారింది . అయితే ఇప్పుడు అప్పుడే ఆమె ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టాలని అనుకోవట్లేదట . ఆ కారణంగానే దాచిపెట్టిందట . కానీ ఎన్ని రోజులు దాచిపెట్టిన అది తాగేది కాదు . రేపో మాపో బయట పడాల్సిందే అంటున్నారు అభిమానులు…!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news