ప్రజెంట్ కోట్లాదిమంది అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా పుష్ప2. అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాని సుకుమార్ తనదైన స్టైల్ లో డైరెక్ట్ చేయబోతున్నాడు . ఈ సినిమాపై నెలకొన్న బజ్ అంతా ఇంతా కాదు . ఈ సినిమాకి సంబంధించిన ఒక్క అప్డేట్ రిలీజ్ అయినా సరే ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోతున్నారు. రీసెంట్గా పుష్ప2 సెట్స్ నుంచి కొన్ని ఫొటోస్ వైరల్ గా మారాయి.
ఈ ఫొటోస్ లో అల్లు అర్జున్ పూర్తి గాయాలతో కనిపిస్తున్నాడు . అల్లు అర్జున్ ఈ సినిమా కోసం పూర్తిగా తన బాడీని లెక్కచేయకుండా కష్టపడుతున్నాడు. అంతేకాదు ఆయన ఒంటిపై గాయాలు క్లియర్గా ఫోటోకి కూడా క్యాప్చర్ అవ్వడంతో అల్లు అర్జున్ కి పుష్ప2సెట్స్ లో ప్రమాదం జరిగి ఉంటుంది అని.. ఆ విషయాన్ని దాచిపెట్టి పుష్ప 2 టీం అభిమానులను మభ్యపెడుతుంది అని.. సుకుమార్ -అల్లు అర్జున్ ని బాగా పిండేస్తున్నాడు అని మాట్లాడుకుంటున్నారు .
కొంతమంది మాత్రం అల్లు అర్జున్ తన సినిమా కోసం ఏమైనా చేస్తాడు అని.. మొదటి నుంచి అల్లు అర్జున్ తన సినిమాల పట్ల చాలా డెడికేషన్ గా వర్క్ చేస్తారని చెప్తున్నారు. పుష్ప 2 సెట్స్ నుంచి లీకైన ఈ ఫొటోస్ ఇప్పుడు అభిమానులకి కొత్త డౌట్లు పుట్టిస్తున్నాయి . బన్నీ ఇంత కష్టపడుతున్నాడు కచ్చితంగా ప్రతిఫలం దక్కుతుందని కొందరు అంటుంటే.. ఇలా ఒళ్ళు హూనం చేసుకోవాల్సిన అవసరం ఏముంది బన్నీ..? అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..!!