Moviesమనసు చంపుకుని..తల్లి కోసం అలాంటి నిర్ణయం తీసుకున్న సమంత..పాపం ఎంత కష్టం...

మనసు చంపుకుని..తల్లి కోసం అలాంటి నిర్ణయం తీసుకున్న సమంత..పాపం ఎంత కష్టం వచ్చిందో..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సమంత తీసుకున్న బోల్డ్ నిర్ణయం ఇప్పుడు సినిమా జనాలకే కాకుండా సామాన్య జనాలకు సైతం షాకింగ్ అనిపిస్తుంది . నిన్న మొన్నటి వరకు సమంత రెండో పెళ్లి చేసుకోదు అంటూ బల్ల గుద్ది చెప్పిన అభిమానులు సైతం .. ఆమె తీసుకున్న నిర్ణయానికి షాక్ అయిపోతున్నారు.

సమంత – నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీళ్ళ మధ్య రిలేషన్షిప్ ఎంత బాగా ముందుకెళ్లిందో మనం చూసాం . అయితే సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ జంట విడాకులు తీసుకున్నారు. వీళ్ళ విడాకులపై ఎన్నో రూమర్లు వైరల్ అయ్యాయి . ఎన్నో పుకార్లు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అయితే రీసెంట్గా సమంత మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకున్నింది.

ఇప్పుడిప్పుడే సినిమాలో నటించడానికి బిజీ అవుతుంది. బాలీవుడ్ లో ఓ సినిమాకి కూడా కమిట్ అయిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే.. సమంత తల్లిదండ్రులు ఆమెను రెండో పెళ్లి చేసుకోమంటూ బలవంతం చేస్తున్నారట . ఇన్నాళ్లు తనకోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకున్న సమంత .. ఇప్పుడు పేరెంట్స్ హ్యాపీగా ఉండడం కోసం రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందట. కానీ ఇప్పుడే చేసుకోను అని .. లైఫ్ లో కొంచెం సెటిల్ అయ్యాక తన మనసు కుదుటపట్టాక చేసుకుంటాను అని కండిషన్ పెట్టిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news