Moviesప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ సినిమా రెడీ... నిర్మాత‌ను మార్చేసి పెద్ద షాక్...

ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ సినిమా రెడీ… నిర్మాత‌ను మార్చేసి పెద్ద షాక్ ఇచ్చారుగా..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ అంటే ఆడియెన్స్‌లో ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో ముందుగా వ‌చ్చిన సినిమా జ‌ల్సా, అత్తారింటికి దారేది రెండు సూప‌ర్ హిట్స్‌. అత్తారింటికి దారేది ఇండ‌స్ట్రీ హిట్‌. ఆ త‌ర్వాత ముచ్చ‌ట‌గా వీరి కాంబినేష‌న్లో రిపీట్ అయిన అజ్ఞాత‌వాసి సినిమా మాత్రం భారీ అంచ‌నాల‌తో వ‌చ్చి బిగ్ డిజాస్ట‌ర్ అయ్యింది.

ఈ సినిమా త్రివిక్ర‌మ్ ప‌రువు మొత్తం గంగ‌లో ప‌డేసింది. ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ కోలుకుని అర‌వింద స‌మేత‌, అల వైకుంఠ‌పురంలో సినిమాలు చేసి హిట్ కొట్టారు. గుంటూరు కారం సినిమా కూడా త్రివిక్ర‌మ్ రేంజ్ హిట్ సినిమా అయితే కాదు. ఈ సినిమా రిజ‌ల్ట్ చూశాక త్రివిక్ర‌మ్‌తో సినిమా చేయాల‌నుకున్న బ‌న్నీ సైతం పున‌రాలోచ‌న‌లో ప‌డ్డాడు. ఇప్పుడు త్రివిక్ర‌మ్‌కు ఏ పెద్ద హీరో ఛాన్స్ ఇస్తాడ‌న్న సందేహాలు మొద‌ల‌య్యాయి.

బ‌న్నీ.. బోయ‌పాటితో క‌మిట‌వుతున్నాడు. ఈ టైంలో మ‌ళ్లీ త్రివిక్ర‌మ్‌.. ప‌వ‌న్‌తో జోడీ క‌ట్ట‌బోతున్న‌ట్టు క్లారిటీ వ‌చ్చేసింది. ప్రస్తుతం రవితేజ తో ఈగిల్ సినిమా నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతల్లో ఒకరైన టిజి విశ్వప్రసాద్ తాను త్రివిక్ర‌మ్ – ప‌వ‌న్ కాంబినేష‌న్లో ఓ భారీ మూవీ ప్లాన్ చేసిన‌ట్టు చెప్పారు. మామూలుగా త్రివిక్ర‌మ్ చిన‌బాబుకు త‌ప్పా ఇత‌ర నిర్మాత‌ల‌కు సినిమా చేయ‌ట్లేదు.

అయితే ఇప్పుడు ప‌వ‌న్ సినిమా కోసం విశ్వ‌ప్ర‌సాద్ నిర్మాత‌గా త్రివిక్ర‌మ్ సినిమా చేస్తున్నాడంటే దీని వెన‌క భారీగానే డ‌బ్బుల వ్య‌వ‌హారం ఉండి ఉంటుంద‌ని.. ప‌వ‌న్‌కు, త్రివిక్ర‌మ్‌కు భారీ రేటు ఆఫ‌ర్ చేయ‌డంతోనే ఈ సినిమా సెట్ అయ్యి ఉంటుంద‌న్న గుస‌గుస‌లు కూడా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో న‌డుస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news