Moviesరాత్రికి రాత్రి కన్నప్పలో నయనతారను తీసేసి.. కంగనాను పెట్టడానికి కారణం అదేనా..?...

రాత్రికి రాత్రి కన్నప్పలో నయనతారను తీసేసి.. కంగనాను పెట్టడానికి కారణం అదేనా..? మంచు విష్ణు మాములోడు కాదు రా నాయనా..!!

కన్నప్ప.. మంచు విష్ణు – మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమానే ఈ కన్నప్ప . ఈ సినిమాలో భారీతారాగానంని పెట్టారు మంచు విష్ణు . అంతే కాదు సినిమా కోసం భారీ బడ్జెట్ కూడా కేటాయించారు . మంచు విష్ణు కెరియర్ లోనే కని విని ఎరుగని బడ్జెట్ తో ఈ సినిమా రాబోతుంది . ప్రతి విషయాన్ని కూడా నిపుణుల సలహా మేరకే ఫాలో అయ్యి తెరకెక్కిస్తున్నారట .

ఈ సినిమాలో శివుడి పాత్రలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించబోతున్నాడు అంటూ ఓ వార్త వైరల్ అయింది. అంతేకాదు మూవీ టీం కూడా కన్ఫామ్ చేసేసింది . అయితే ప్రభాస్ కి జోడిగా పార్వతి దేవి పాత్రలో నయనతార నటించబోతుంది అంటూ ప్రచారం జరిగింది . తెరపై ప్రభాస్ – నయనతార జంటకు మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి . దీంతో ఫ్యాన్స్ కూడా ఈ కాంబో కోసం వెయిట్ చేసారు .

అయితే సడన్గా మేకర్స్ ఈ సినిమా నుంచి నయనతారను తప్పించి కంగనాను పార్వతి దేవి పాత్రలో చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. దానికి రీజన్ చిన్న పాత్ర కోసం నయనతార డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్. సౌత్ ఇండస్ట్రీలో నయనతారకి ఎలాంటి క్రేజీ స్థానం ఉందో కంగానకి కూడా అలాంటి స్థానమే ఉంది. కాకపోతే కాంట్రవర్షల్ బ్యూటీ అన్న ట్యాగ్ కూడా ఉంది. ఈ క్రమంలోనే నయనతార కి అంత రెమ్యూనరేషన్ ఇచ్చుకోలేని టీం కంగనాను రీప్లేస్ చేసిందట . ఆల్రెడీ ప్రభాస్ – కంగన్నా ల జంట కూడా జనాలను మెప్పించింది . మరోసారి ఈ జంట అభిమానులను మెప్పిస్తే అది నిజంగా హైలెట్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news