టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే . తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానితో పెళ్లి పీటలు ఎక్కబోతుంది . ఫిబ్రవరి 21న గ్రాండ్ గా గోవాలో వీళ్ళ పెళ్లి జరగబోతుంది . వీళ్ళ పెళ్లికి సంబంధించిన పనులు మొత్తం చకచకా కంప్లీట్ చేసేసుకుంటున్నారు . అంతేకాదు వీళ్ళ పెళ్లికి సంబంధించిన ప్రతి పనిని దగ్గరుండి చూసుకుంటుంది రకుల్ ప్రీత్ సింగ్ .
తన పెళ్లి తనకు ఇష్టమైన విధంగా నచ్చే విధంగా చేసుకోవాలి అని డిసైడ్ అయిందట . అందుకే గోవాలో వెడ్డింగ్ డెస్టిని ప్లాన్ చేసుకున్న రకుల్ తనకు నచ్చిన విధంగా పెళ్లి చేసుకుంటుందట . అంతేకాదు జనరల్గా పెళ్లి అంటే టపాసులు పేల్చడం సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది . అయితే రకుల్ మాత్రం తన పెళ్లిలో అలాంటివి ఏమీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుందట . పెళ్లిలో ఎలాంటి టపాసులు బాంబులు పేల్చద్దు అని చెప్పేసిందట .
పాశ్చాత్య సంప్రదాయానికి వీడ్కోలు పలికి ఎకో వెడ్డింగ్ కి ముందడుగు వేయాలి అని ఈ నిర్ణయం తీసుకుందట . తన పెళ్లిలో టపాసులు వద్దన్నా మొదటి హీరోయిన్ రకుల్ అంటూ జనాలు పొగడేస్తున్నారు. రకుల్ తీసుకున్న నిర్ణయాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు . రకుల్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటూ విషెస్ అందిస్తున్నారు. ప్రెసెంట్ రకుల్ తన పెళ్లి పనుల్లో బిజీగా ఉంది . ఆమె చివరిగా నటించిన సినిమా ఆయాలన్. తర్వాత ఇండియన్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..!!