రష్మిక మందన్నా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేషనల్ క్రష్ గా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ .. ఆ తర్వాత మంచి మంచి ఆఫర్స్ పట్టేసింది . అమ్మడు టాలెంట్ నో..? లేక అదృష్టమో తెలియదు కానీ.. చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇంకేముంది టాలీవుడ్ జనాలు నెత్తిన పట్టేసుకున్నారు .
తద్వారా బాలీవుడ్ లో కూడా అవకాశాలు వచ్చాయి . రీసెంట్గా బాలీవుడ్లో నటించిన అనిమల్ సినిమా సెన్సేషనల్ హిట్ ని నమోదు చేసుకుంది . ఈ సినిమాతో బోల్డ్ బ్యూటీగా కూడా ట్యాగ్ చేయించుకుంది . కాగా రీసెంట్గా రష్మిక మందన్నాకి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. రష్మిక మందన్నా ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం అయింది . అయితే కొన్ని అనివార్య కారణాల చేత ఆమె తన నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకుంది . అప్పట్లో ఈ న్యూస్ సెన్సేషన్ గా మారింది .
అయితే రష్మిక కావాలనే రక్షిత్ శెట్టితో ని నిశ్చితార్ధాని బ్రేక్ చేసుకుంది అంటూ పలువురు ఆమెను ట్రోల్ చేశారు . రక్షిత్ కి రష్మిక అంటే పీకల్లోతు కోపం ఉంది అంటూ ఫేక్ వార్తలను పుట్టించారు . తాజాగా అలాంటి వ్యాఖ్యలపై రక్షిత్ శెట్టి స్పందించారు. రష్మిక తో నాకు మంచి రిలేషన్ షిప్ ఏ ఉంది అని.. నిశ్చితార్థం బ్రేక్ అయిన మేము మంచి ఫ్రెండ్స్ గానే ఉన్నాము అని ..ఆమె అనుకున్నది సాధిస్తుంది అని .. ఆమెకు కొన్ని ఆశలు ఆశయాలు ఉన్నాయి అని .. అవి కచ్చితంగా ఆమె సాధిస్తుంది అన్న నమ్మకం నాకు ఉంది అని .. ఆమె ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవడంపై కూడా పాజిటివ్‌గా స్పందించారు . దీంతో రష్మిక – రక్షిత్ శెట్టి పై వస్తున్న నెగటివ్ వార్తలకు బ్రేక్ పడినట్లు అయింది..!!