MoviesTL రివ్యూ: ఈగ‌ల్‌.. ఎలివేష‌న్లు, యాక్ష‌న్ అదుర్స్‌

TL రివ్యూ: ఈగ‌ల్‌.. ఎలివేష‌న్లు, యాక్ష‌న్ అదుర్స్‌

టైటిల్‌: ఈగ‌ల్‌
నటీనటులు: రవితేజ, కావ్య థాపర్,అనుపమ పరమేశ్వరన్, వినయ్ రాయ్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ తదితరులు
ఎడిటింగ్: కార్తీక్ ఘట్టమనేని
సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ ఘట్టమనేని, కర్మ్ చావ్లా, కమిల్ ప్లాకి
మ్యూజిక్‌: డావ్ జాన్డ్
నిర్మాత: టి జి విశ్వ ప్రసాద్
దర్శక‌త్వం : కార్తీక్ ఘట్టమనేని
రిలీజ్ డేట్‌ : ఫిబ్రవరి 09, 2024

ప‌రిచ‌యం :
మాస్ మహారాజ్ రవితేజ సినిమా జయాప‌జయాలతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ధమాకా, వాల్తేరు వీర‌య్య‌ సినిమాలతో వరుసగా రెండు సూపర్హిట్లు కొట్టిన రవితేజ ఆ తర్వాత రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో రెండు డిజాస్టర్లు ఇచ్చారు. తాజాగా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా బ్యానర్లో తరకెక్కిన ఈగల్ సినిమాలో నటించారు. సంక్రాంతికి రావలసిన ఈ సినిమా కాస్త ఆలస్యంగా ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. మరి ఈగల్ సినిమాతో అయినా రవితేజ హిట్ కొట్టారో లేదో సమీక్షలో చూద్దాం.

క‌థ :
ఢిల్లీలో జర్నలిస్టుగా పనిచేస్తున్న నళిని ( అనుపమ పరమేశ్వరన్) కి ఒకరోజు మార్కెట్లో స్పెషల్ కాటన్ క్లాత్ కనిపిస్తుంది. అది ఎక్కడ తయారు చేశారని ఆమె ఆరా తీసే క్రమంలో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఆ క్లాత్ కి వాడిన పత్తిని ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలోని మదనపల్లి సమీపంలో తలకోన ప్రాంతంలో పండించారని.. దానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గిరాకీ తెచ్చింది సహదేవ్‌ వర్మ ( రవితేజ) అనే వ్యక్తి అని తెలుస్తుంది. అయితే అతడు అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోయాడని ఆమె తెలుసుకుంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి గురించి సమాజానికి తెలిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ విషయాన్ని ఆమె పేపర్లో ప్రచురిస్తుంది. చిన్న పేజీలో చిన్న ఆర్టికల్గా వచ్చిన ఆ న్యూస్ చూసి ఏకంగా సిబిఐ రంగంలోకి దిగుతుంది. ఆ పత్రిక సంస్థ పై దాడి చేసి ఆ సమాచారం ఎలా? లీక్ అయిందని ఎంక్వయిరీ మొదలుపెడుతుంది.

ఒక చిన్న వార్త చూసి సిబిఐ వాళ్ళు అంతలా రియాక్ట్ అయ్యారు అంటే దీని వెనకాల ఏదో పెద్ద సీక్రెట్ దాగి ఉందని.. అది ఏంటో తెలుసుకోవాలని నళిని తలకోన గ్రామానికి వెళుతుంది. అక్కడ సహదేవ వర్మ గురించి ఆరా తీసే క్రమంలో చాలా ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయి. అసలు సహదేవ వర్మ ఎవరు ? అతడిని మట్టు పెట్టటానికి కేంద్ర ప్రభుత్వ బలగాలు… పాకిస్తాన్ కి చెందిన టెర్రరిస్టులతో పాటు నక్సల్స్ ఎందుకు ట్రై చేస్తూ ఉంటారు. యూర‌ప్‌లో కాంట్రాక్టు కిల్లర్ అయిన ఈగల్ ( రవితేజ) కి సహదేవ్‌ వర్మకి ఉన్న సంబంధం ఏంటి ? సహదేవ్‌ ఎలా మిస్ అయ్యాడు ? సహదేవ్ రచన ( కావ్య తాపర్ ) లవ్ స్టోరీ ఏంటి ? సహదేవ్‌ అనుచరుడైన జై ( నవదీప్) ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు ? తలకోన కొండను దక్కించుకునేందుకు బిజినెస్ మ్యాగ్నెట్ ( నితిన్ మెహతా), లోకల్ ఎమ్మెల్యే చిల్లర సోమేశ్వర్ రెడ్డి ( అజయ్ ఘోష్‌) ఎందుకు ప్రయత్నించారు ? వారిని ఈగల్ ఎలా అడ్డుకున్నాడు.. అసలు సహదేవ్‌ బతికే ఉన్నాడా లేదా ? ఈ కథలో మధుబాల – అవసరాల శ్రీనివాస్ – విజయ్ పాత్రలు ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే ఈగల్ సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ :
కే జి ఎఫ్ సినిమా వచ్చాక యాక్షన్ సినిమాలను ప్రజెంట్ చేసే కోణం మారింది. కథ‌కంటే యాక్షన్, ఎలివేషన్లకే దర్శకులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే సినిమా లవర్స్ కూడా అలాంటి సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. ఈగ‌ల్‌ కూడా ఆతర‌హా చిత్రమే. కేజిఎఫ్, విక్రమ్, జైలర్ తరహా లోనే ఇందులో భారీ యాక్షన్ సీన్లతో పాటు హీరోకి కావలసినంత ఎలివేషన్ ఇచ్చారు. అయితే కథను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పటంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. కేవలం యాక్షన్.. ఎలివేషన్ నమ్ముకుని కథలన్నీ నడిపించాడు. సినిమా స్టార్టింగ్ నుంచే హీరోకి భారీ ఎలివేషన్ ఇచ్చారు. ప్రతి సీన్ క్లైమాక్స్ అన్నట్టుగా తీర్చిదిద్దారు. మణిబాబు రాసిన సంభాషణలు హీరోని ఒక రేంజ్ లో కూర్చోబెట్టేలా ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల వచ్చే డైలాగుల‌కు అక్కడ జరిగే సన్నివేశానికి ఎలాంటి లింకు ఉండకపోవడం అతిగా అనిపిస్తుంది.

సినిమా మొత్తం మీద యాక్షన్ సీన్లు అదిరిపోతాయి.. సినిమా కథ‌ ఢిల్లీలో మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తలకోన ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. జర్నలిస్టు నళిని వార్త ప్రచురించడం సిబిఐ రంగంలోకి దిగి పత్రిక సంస్థపై దాడి చేయడంతో కథపై ఇంట్రెస్ట్ కలుగుతుంది. హీరో ఎంట్రీ ఇచ్చే ఎలివేషన్స్ సీన్ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ అఫ్ అంతా ఎలివేషన్లతోనే ముగిస్తుంది. హీరో క్యారెక్టర్ ఏంటో ?తెలియకుండా అన్ని ఎలివేషన్లు ఇవ్వడంతో కొన్నిచోట్ల అంత బిల్డప్ అవసరమా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫీ ఆసక్తి పెంచుతుంది. సహదేవ్ – రచన లవ్ స్టోరీ అంతగా ఆకట్టుకోదు. అయితే కథకు అది ఇంపార్టెంట్.

సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్లు అదిరిపోతాయి. పబ్లి నేపథ్యంలో వచ్చే ఫైట్ సీన్ సూపర్‌గా ఉంటుంది. అలాగే ఫ్రీ క్లైమాక్స్ యాక్షన్ సీన్ కూడా బాగుంటుంది. సినిమాలో మంచి సందేశం ఉన్న దాన్ని ఓ చిన్న సన్నివేశంతో ముగించేశారు. ఈగల్ పాత్రలో రవితేజ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ రవితేజ నటించిన విధానం ఆకట్టుకుంది. తన బాడీ లాంగ్వేజ్ తో కొన్ని యాక్షన్, ఎమోషనల్ సీక్వెన్సెస్‌లో తన స్టైలిష్ లుక్ లో రవితేజ బాగా నటించాడు. కావ్యతో సాగిన లవ్ స్టోరీ లో రవితేజ ఆకట్టుకున్నాడు. హీరోయిన్గా కావ్య మెప్పించింది. ఎమోషనల్ సీన్లలో ఆమె చాలా సెటిల్ గా నటిస్తూ ఆకట్టుకుంది. కీలకపాత్రలో నటించిన అనుపమ పరమేశ్వర‌న్‌ కూడా మెప్పించింది. మరో కీలకపాత్రలో నటించిన నవదీప్ బాగా నటించాడు.

వినయ్ రాయ్ యాక్టింగ్ పరంగా తన గత చిత్రాల కంటే చాలా బాగా చేశాడు. శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ మిగిలిన నటీనటులు అందరూ పాత్రల పరిధి మేరకు మెప్పించారు. దర్శకుడు కార్తీక్ రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్.. ఎమోషనల్ సీన్లు బాగున్నాయి. ఈగల్ పాత్రను ఆ పాత్ర తాలూకూ ఫ్లాష్ బ్యాగ్‌ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు అంతే స్థాయిలో సినిమా కథనాన్ని రాసుకోలేదు. ఆసక్తికరంగా కథనాన్ని రాసుకోవడంలో విప్లమయ్యాడు.. సన్నివేశాలు స్లోగా రెగ్యులర్గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్ ను యాక్షన్స్ సన్నివేశాలతో స్పీడుగా నడిపిన దర్శకుడు సెకండ్ హాఫ్ ను బాగా సాగదీశారు. ఒక క్లైమాక్స్ మినహా మిగిలిన కథనంలో ఇంట్రెస్టింగ్ పెంచడంలో విఫలమయ్యారు. కథను మలుపు తిప్పే ప్రధాన పాత్ర అయినా కావ్య థాపర్ పాత్రను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి అంతే ఎఫెక్టివ్ గా ఆ పాత్రకు ముగింపు ఇవ్వాల్సింది.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే…
టెక్నికల్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కొన్ని సన్నివేశలను యాక్షన్ పరంగా.. ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినా తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తిస్థాయిలో ఆకట్టుకునే స్క్రీన్ ప్లే రాసుకోలేదు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు పాటలు పరవాలేదు. సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. దర్శకుడు స్వతహాగా సినిమాటోగ్రాఫర్ కావడంతో కొన్ని సీన్లు హాలీవుడ్ రేంజ్ లో ఉన్నట్టు ఉంటాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే అక్కడక్కడ సాగదీత సీన్లు ట్రిమ్ చేయాల్సింది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు.

ఫైన‌ల్‌గా…
ఈగల్ అంటూ వచ్చిన ఈ భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాలో రవితేజ నటన.. యాక్షన్ సీన్లు.. రవితేజ పాత్ర ఎలివేషన్లు.. ఎమోషన్లు.. క్లైమాక్స్ అదిరిపోయాయి. సినిమాలో బలమైన ఎమోషన్ ఉన్న స్క్రీన్ ప్లే మైనస్ గా ఉంది. ఓవరాల్ గా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులతో పాటు రవితేజ అభిమానులు.. మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.

ఫైన‌ల్ పంచ్ : మాస్ మెచ్చే ఈగ‌ల్

ఈగ‌ల్ రేటింగ్: 2.75 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news