ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి వార్త రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనం చూస్తున్నాం . ఇన్నాళ్లు ఆమె తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానితో ప్రేమలో మునిగితేలి.. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ పెళ్లి వార్తలపై ఏ విధంగా రియాక్ట్ కాకపోవడంతో నిజంగానే ఆమె పెళ్లి చేసుకోబోతుంది అని అఫీషియల్ కన్ఫర్మేషన్ కి వచ్చేసారు అభిమానులు.
అంతేకాదు ఆరు నెలలు కష్టపడి వీళ్లు తమ వెడ్డింగ్ డెస్టినీను గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారట . రకుల్ ప్రీత్ సింగ్ మొదట మిడిల్ ఈస్ట్ లో తన పెళ్లిని గ్రాండ్గా అంగరంగ వైభవంగా చేసుకోవాలని డిసైడ్ అయిందట . దానికోసం చాలా పక్క ప్లానింగ్ తో ముందుకు కూడా వెళ్లిందట . అంతేకాదు అంతా సవ్యంగా సాగిపోతుంది అనుకున్న మూమెంట్లో డిసెంబర్లో భారత ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు వీలు తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తమ పెళ్లి ఇండియా లోనే చేసుకోబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
అంతేకాదు రకుల్ ప్రీత్ సింగ్ ఏజ్ చేసిన చాలా డిఫరెంట్ గా చేస్తుంది. పెళ్లిని కూడా చాలా డిఫరెంట్ పద్ధతిలో చేసుకోబోతుందట. అయితే ఇక్కడ ఆమె మిడిల్ ఈస్టులో పెళ్లి చేసుకోకపోవడం పై మరొక కొత్త రూమర్ కూడా ట్రెండ్ అవుతుంది. ఆల్రెడీ రకుల్ ప్రీత్ సింగ్ జాకీ జాతకం కలవలేదు అని .. వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా విడాకులు తీసుకుంటారు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి .వాళ్ళు చూపించిన పంతులు కూడా ఇదే విషయం చెప్పారట .
అంతేకాదు వాస్తు ప్రకారం జాతక దోషం ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ మిడిల్ ఈస్ట్ లో పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా విడాకులు తీసుకోవడంతో పాటు ప్రాణహాని కూడా ఉంటుందట . ఆ కారణంగానే రకుల్ ప్రీత్ సింగ్ లాస్ట్ మూమెంట్లో వెడ్డింగ్ డేస్టిని మార్చేసింది అన్న రూమర్ కూడా వైరల్ అవుతుంది. గతంలో వేణు స్వామి సైతం రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకున్న విడాకులు తీసుకోవడం పక్క అంటూ బల్ల గుద్ధి చెప్పేశారు. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లిపై ఇప్పుడు అందరికీ టెన్షన్ మొదలైంది..!!