Moviesఓరి దేవుడోయ్..విశ్వంభర కోసం బిగ్ రిస్క్ చేస్తున్న చిరంజీవి.. తేడా కొడితే...

ఓరి దేవుడోయ్..విశ్వంభర కోసం బిగ్ రిస్క్ చేస్తున్న చిరంజీవి.. తేడా కొడితే అడుక్కుతినాల్సిందేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా విశ్వంభర. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. వశిష్ట.. చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతోనే జాక్ పాట్ ఆఫర్ కొట్టాడు అంటూ అంతా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేశారు . ఈ సినిమాపై వశిష్ట రిలీజ్ చేసిన ఒక్కొక్క అప్డేట్ గూస్ బంప్స్ తెప్పిస్తూ వచ్చింది.

రీసెంట్గా ఈ సినిమాలో హీరోయిన్ త్రిష కూడా జాయిన్ అయింది . కాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ లీక్ అయి నెట్టింట వైరల్ గా మారింది . ఈ సినిమాలో చిరంజీవి ట్విన్ బ్రదర్స్ గా కనిపించబోతున్నారట . అంతేకాదు ఒక పాత్ర కోసం 70 ఏళ్లు పైబడిన వృద్ధుడిగా కనిపించబోతున్నారట . చిరంజీవి ఈ ఏజ్ లో పెద్ద సాహసమే చేస్తున్నాడు అంటున్నారు అభిమానులు.

మరి కొంతమంది ఇది బిగ్ రిస్క్ అని .. భారీ బడ్జెట్లో తెరకెక్కే సినిమాలో ఇలాంటి రిస్క్ చేయడం చాలా తప్పు అని ..వశిష్టకు వార్నింగ్ ఇస్తున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ గాసిప్ బాగా ట్రెండ్ అవుతుంది. అయితే రిస్కులు చేయడం చిరంజీవికి కొత్త కాదు .. గతంలో ఎన్నో రిస్కులు చేశాడు . అలా రిస్కులు చేస్తేనే హీరో దగ్గర నుంచి మెగాస్టార్ గా మారాడు అంటున్నారు మెగా అభిమానులు . చూడాలి మరి చిరంజీవి ఈ సినిమాతో ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకుంటాడో..కొత్త చరిత్రను ఎలా సృష్టించబోతున్నాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news