Moviesవిరాట్ కొడుకు అకాయ్ .. చరణ్ కూతురు క్లీం కార..బర్త సీక్రేట్స్...

విరాట్ కొడుకు అకాయ్ .. చరణ్ కూతురు క్లీం కార..బర్త సీక్రేట్స్ ఏంటో తెలుసా..? ఆ ఒక్కటి భలే కలిసి వచ్చిందే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ కి ఉపాసనకి పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత క్లింకార జన్మించిన విషయం అందరికీ తెలిసిందే . మెగా మనవరాలి రాకతో కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. అంతేకాదు క్లిం కార మెగా ఫ్యామిలీకి లక్కీ అంటూ స్వయాన మెగాస్టార్ చిరంజీవినే ప్రకటించారు . కాగా క్లింకార ఫోటో ఇప్పటివరకు రివీల్ చేయకపోయినా జనాలు మాత్రం క్లీం కార ఇలా ఉంటుంది అంటూ ఏ ఐ ద్వారా ట్రెండ్ చేస్తున్నారు .

రీసెంట్గా విరాట్ కోహ్లీకి కొడుకు జన్మించిన విషయం తెలిసిందే . విరాట్ కోహ్లీ అనుష్క శర్మ లకు పండు లాంటి బాబు పుట్టాడు. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది జంట . ఈ అబ్బాయి పేరు అకాయ్ అంటూ కూడా రివీల్ చేశారు. వీళ్లిద్దరి పుట్టుకకు భర్త స్టైల్ ఒకటే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . నిజానికి క్లీం కార కూడా డెలివరీ డేట్ కి ఒక రోజు ముందే జన్మించిందట .

మన విరాట్ కొడుకు అకాయ్ కూడా అదే విధంగా డేలివరీ కి ఒక్క రోజు ముందే బయటకి వచ్చారట. అంతేకాదు క్లింకారా పుట్టిన టైమ్ విరాట్ కొడుకు అకాయ్ పుట్టిన టైం కూడా ఒకటే అంటూ ప్రచారం జరుగుతుంది . దీంతో సోషల్ మీడియాలో వీరిద్దరి భర్త సీక్రెట్స్ వైరల్ అవుతున్నాయ్. కాగా రీసెంట్ గానే నిఖిల్ కూడా తండ్రి అయ్యాడు. పల్లవికి పండు లాంటి బాబు జన్మించాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news