ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ట్స్ త్వర త్వరగా పెళ్లిలు చేసేసుకుంటున్నారు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ చాలా లేటుగా పెళ్లిళ్లు చేసుకునేవాళ్లు. అయితే ఇప్పుడు మాత్రం చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేసుకొని లైఫ్ లో సెటిలైపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . కాగా ఈ మధ్యకాలంలో టాప్ మోస్ట్ హీరోయిన్స్ అందరూ కూడా ప్రియుడి పేరుని ఓపెన్ గా పరిచయం చేస్తూ పెళ్లికి సిద్ధమవుతున్నారు. రీసెంట్ గానే రకుల్ ప్రీత్ సింగ్ గోవాలో తన పెళ్లిని ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకునింది.
బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానితో ఏడడుగులు వేసి కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసింది . రీసెంట్ గా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది మరో స్టార్ హీరోయిన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ తాప్సీ పన్ను కూడా పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. రీసెంట్ గానే ఆమె షారుక్ ఖాన్ నటించిన డంకీ సినిమాలో హీరోయిన్గా కనిపించింది . సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే తాప్సి తన బాయ్ ఫ్రెండ్ ని కూడా అభిమానులకి పరిచయం చేసింది .
దాదాపు 10 ఏళ్లకు పైగా ప్రేమాయణం కొనసాగిస్తున్నాను అంటూ అఫీషియల్ గా ప్రకటించింది . అయితే త్వరలోనే తాప్సి తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి పీటలు ఎక్కబోతుందట. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. మార్చి 27వ తేదీ ఉదయపూర్ లో అట్టహాసంగా వీళ్ల పెళ్లి జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . బాలీవుడ్ సినీ ప్రముఖులు సన్నిహితులు మాత్రమే ఈ పెళ్ళికి హాజరు కాబోతున్నారట . వీరిద్దరి వివాహం సిక్కు – క్రైస్తవ సాంప్రదాయంలో జరగబోతుంది అంటూ తెలుస్తుంది..!!