జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా దేవర. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులకు హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి . ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొడుతుంది అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా పుష్ప లాగా రెండు భాగాలుగా రాబోతుంది . చాలా కష్ట పడి తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ ఈ సినిమాని ఆయన పడుతున్న కష్టం ఆధారంగా తెలుస్తుంది.
అయితే కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుంది . కాగా ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ కథను ముందుగా అల్లు అర్జున్ తో తెరకెక్కించాలనుకున్నారట . దానికి సంబంధించి గతంలో అఫీషియల్ ప్రకటన కూడా చేశారు.
అయితే ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడట మన అల్లు అర్జున్ . కొన్ని సంవత్సరాలు బన్నీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించుకుని తిరిగారట. దీంతో ఆ కథను హోల్డ్ లో పెట్టి మార్పులు చేర్పులు చేసి అల్లు అర్జున్ తో తెరకెక్కించాల్సిన కథను ఎన్టీఆర్ కి చెప్పి ఒప్పించి ఫైనల్లి ఆయన కాల్ షీట్స్ తీసుకుని ..సినిమాకి కమిట్ అయ్యాడు కొరటాల. ఒకవేళ ఈ సినిమా రిలీజ్ అయిన హిట్ కొడితే ఎన్టీఆర్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ గా నిలిచిపోతుంది ..అప్పుడు అల్లు అర్జున్ మిస్ చేసుకున్న హిట్ సినిమాగా చరిత్రలో నిలిచిపోతుంది అంటున్నారు జనాలు..!!