సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్స్ కాదు .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే వాళ్లకు కూడా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఎదురవుతాయి . వదిన – తల్లి పాత్రలు చేసే వాళ్లకు కూడా కొన్ని కొన్ని సార్లు వాళ్లకు ఇష్టం లేని పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది . అయితే కొంతమంది తప్పక వాటిని భరిస్తే మరి కొంతమంది మాత్రం బోల్డ్ గా అలా చేయము అంటూ సినిమా నుంచి తప్పుకుంటారు . అదే లిస్టులోకి వస్తుంది నటి జయలక్ష్మి . టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రల్లో నటించిన జయలక్ష్మి అందరికీ సుపరిచితురాలు .
చాలా చాలా సినిమాలలో ఆమె తనదైన స్టైల్ లో నటించి ఆకట్టుకుంది. తల్లిగా – వదినగా అనేక పాత్రలు చేసి అభిమానులను మెప్పించింది . ఆమె కుమార్తె అమెరికాలో ఉండడం వల్ల తరచూ అమెరికా ఇండియా తిరుగుతూ వచ్చేది . ఈ క్రమంలోనే మంచి మంచి సినిమాలలో అవకాశాలను మిస్ చేసుకుంది . రీసెంట్గా జయలక్ష్మి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి . ఇండస్ట్రీలో చాలామంది నటులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పి షాక్ ఇచ్చింది . అంతేకాదు తాను ఓ సినిమా విషయంలో అలాగే ఇబ్బందులు పడ్డాను అంటూ చెప్పుకొచ్చింది.
నిజానికి ఆమెకు సినిమాలో అవకాశాలు రావడానికి కారణం దాసరి నారాయణరావు గారి భార్య పద్మ అంటూ అసలు విషయాన్ని బయట పెట్టింది . ఆమె రికమండేషన్ తోనే పొలిటికల్ రౌడీ అనే చిత్రంలో అవకాశం వచ్చిందట . ఈ చిత్రంలో ఆమె పాత్ర ఐఏఎస్ అధికారి భార్య అంటూ చెప్పి క్లబ్ ప్రెసిడెంట్ గా నటించమన్నారట . అంతేకాదు హుందాగా ఉండే పాత్రే కదా అంటూ సంతోషపడిందట. కొన్ని సీన్స్ షూట్ చేశాక ఒకరిని ఇంప్రెస్ చేయడానికి కొంగు జార్చే సన్నివేశం షూట్ చేయాలన్నారట . దానికి ఆమె ఒప్పుకోలేదట .
ఎంతమంది అడిగినా సరే నో చెప్పుతూ వచ్చిందట . ఫైనల్లీ ఆ విషయం మోహన్ బాబు గారి దగ్గరకు వెళ్లిందట. మోహన్ బాబు గారు ఆమెను ఏమనకుండా వదిలేశారట . నిజానికి సెట్స్ లో ఏదైనా ఇష్యూ వస్తే మోహన్ బాబు భయంకరంగా తిడతారు అని.. కానీ నన్ను ఒక్క మాట అనకుండా పంపించేశారు అని.. బహుశా నేను దాసరి నారాయణరావు గారి భార్య రికమండేషన్ తో వచ్చాను అన్న కారణంతోనే ఏమో అంటూ చెప్పుకొచ్చింది . అంతేకాదు కఠినంగా అరిచినా ..మోహన్ బాబు గారిది మంచి మనసు అంటూ కూడా చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!