టాలీవుడ్లో తెలుగు హీరోయిన్లు తక్కువ. పాత తరం హీరోయిన్లను వదిలేస్తే ఆ తర్వాత తెలుగు నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకున్న హీరోయిన్లను వేళ్లమీద లెక్కించవచ్చు. లయ తర్వాత ఆ స్థాయిలో కాస్తో కూస్తో తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన అమ్మాయి అంజలి మాత్రమే. లయ విషయానికి వస్తే ఆమె విజయవాడ అమ్మాయి. విజయవాడలోని లయోలా కాలేజ్‌లోనే ఆమె చదువు పూర్తి చేసుకుంది.
వేణు హీరోగా వచ్చిన స్వయంవరం సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన లయ ఆ తర్వాత స్టార్ హీరోల్లో బాలయ్య లాంటి వాళ్ల పక్కన నటించింది. తెలుగమ్మాయి కావడం.. గ్లామర్ రోల్స్‌కు దూరంగా ఉండడంతో అనుకున్న మంచి ఛాన్సులు ఆమెకు రాలేదు. ఇక సినిమాలకు దూరమయ్యాక లయ అమెరికాలో ఉండే ఎన్నారై డాక్టర్‌ను ప్రేమ వివాహం చేసుకుని అక్కడ సెటిల్ అయ్యింది.
చాలా లాంగ్ గ్యాప్ తర్వాత రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో చిన్న పాత్రతో ఆమె తిరిగి తెలుగు తెరపై మెరిసింది. తెలుగులో మంచి అవకాశాలే వస్తే నటించేందుకు రెడీ అని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. ఇక గాయకుడు రామకృష్ణ తనయుడు సాయికిరణ్ తరుణ్ తో కలిసి చేసిన నువ్వేకావాలి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత లయతో కలిసి సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో ప్రేమించు సినిమాలోనూ నటించాడు.
ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్‌లో కీలక పాత్రలలో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన తాజా ఇంటర్వ్యూలో లయతో ప్రేమాయణం, పెళ్లి గురించి సాయికి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. తమ ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమలు లేవని.. అయితే మా ఇద్దరం మంచి స్నేహితులం కావడంతో పాటు.. మా జోడీ చూడడానికి బాగుంటుందని.. మా తల్లిదండ్రులు మా ఇద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నారని సాయి కిరన్ చెప్పాడు.
మా ఫ్యామిలీ జాతకాలు బాగా నమ్ముతారు.. ఇద్దరి జాతకాలు చూపించగా.. అవి కలవలేదని.. అప్పటి నుంచి మా ఇద్దరి పెళ్లి మ్యాటర్‌కు బ్రేక్ పడిపోయిందని సాయికిరణ్ చెప్పాడు. ఇక తాము ఇప్పటకీ మంచి ఫ్రెండ్స్‌గానే ఉన్నామని.. తర్వాత ఇంద్రజిత్తు అనే షో కూడా చేశాం.. తమ్మారెడ్డి భరద్వాజ ఎంతో బాగుంది సినిమాలో కూడా కలిసి నటించామని సాయికిరణ్ తెలిపాడు.