శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ పేరు ఎలా మరుమోగుతుందో చూస్తూనే ఉన్నాం. వరుస పెట్టి స్టార్ హీరోలతో పాటు.. కుర్ర హీరోలతో నటిస్తోంది. గత నాలుగైదు నెలలలో ప్రతి నెలకు ఆమె నటించిన సినిమా ధియేటర్లలో రిలీజ్ అవుతూనే వస్తోంది. శ్రీ లీల అచ్చ తెలుగు అమ్మాయి. చాలా సంవత్సరాల తర్వాత తెలుగు అమ్మాయి స్టార్ హీరోయిన్గా, గ్లామర్ హీరోయిన్గా నిలబెట్టుకోవటం నిజంగా గ్రేట్. శ్రీలీల విజయవాడ అమ్మాయి. ఆమె తల్లి ప్రకాశం జిల్లాకు చెందినవారు. ఆమె ముంబైలో మెడిసిన్ చదువుతూ ఉండగానే ఇటు గ్లామర్ ఫీల్డ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన ‘ పెళ్లి సందడి ‘ సినిమాలో.. రాఘవేంద్రరావు ఆమెకు ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా కేవలం హీరోయిన్ వల్లే హిట్ అయింది. ఆ తర్వాత రవితేజ ‘ ధమాకా ‘ సినిమా సూపర్ హిట్. వెంటనే అవకాశాలు తన్నుకు వచ్చాయి. వరుసగా ఒకేసారి పది సినిమాలకు సైన్ చేసిందంటే శ్రీలీల డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీలీల అచ్చంగా తెలుగుపిల్ల.. కానీ పుట్టింది అమెరికాలోని ఓ తెలుగు జంటకు. శ్రీలీల తల్లి ప్రకాశం జిల్లాకు చెందినవారు. ఆమె పేరు స్వర్ణలత స్వర్ణలత. భర్త విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త.
సూరపనేని శ్రీలీల అమెరికాలోనే పెరిగింది. ఆ తర్వాత తల్లి స్వర్ణలత బెంగుళూరు వచ్చి అక్కడ గైనకాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తోంది. శ్రీలీల కూడా తల్లి బాటలోనే మెడిసిన్ చదువుతుంది. ‘ ధమాకా ‘ సినిమా చూసిన వాళ్లకు ఆమె డ్యాన్స్ స్కిల్ బాగా అర్థమైంది. చిన్నప్పుడే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ కూడా తీసుకుంది ఆమె. ఇటీవల మహేష్ బాబు సైతం ఆమెతో డ్యాన్స్ చేయాలంటే తాట తెగిపోద్ది అని చెప్పిన మాట నిజం. మంచి ఎనర్జీ పిల్ల.. కొరియోగ్రాఫర్ చెప్పిన స్టెప్లు అలవోకగా అందంగా వేయగలదు. ఏ డ్యాన్స్ అయితే శ్రీలీలను స్టార్ హీరోయిన్గా మార్చిందో.. ఇప్పుడు అదే డ్యాన్స్ ఆమెను డీగ్రేడ్ చేస్తుంది.
జస్ట్ ఆమెను డ్యాన్సులు కోసం తీసుకుంటూ ఎగిరేలా చేస్తున్నారు. వరుసగా ఫ్లాప్‌లు వస్తున్నాయి. ఐరన్ లెగ్ అంటూ ఆమెపై ముద్ర వేస్తున్నారు. నిజంగా భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల పాత్ర చూస్తే అందరూ షాక్ అవుతారు. కెరీర్ ప్రారంభంలో అది కూడా మూడో సినిమాకు ఇంత బరువైన పాత్రను సీనియర్ హీరోతో పోటీపడి చేయటం అంటే మామూలు విషయం కాదు. శ్రీలీల లెక్కపై మంచి కథాబలం ఉన్న సినిమాలు చేస్తే మరో ఐదారేళ్ళపాటు ఆమెకు టాలీవుడ్ లో తిరుగే ఉండదని చెప్పాలి.