సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన్నాలకు సంబంధించిన పెళ్లి వార్త ఈ మధ్యకాలంలో ఎలా ట్రెండ్ అయిందో మనం చూసాం . కేవలం వాళ్ళ పెళ్లి వార్తే కాదు వాళ్ళు డీప్ గా ప్రేమించుకుంటున్నారు అని ..పీకల్లోతు ప్రేమాయణం లో తేలిపోయారు అని.. ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అని ఈ మధ్యకాలంలో బాగా వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే వీటిపై రీసెంట్గా విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు . తనకు హీరోయిన్ రష్మిక మందన్నాకు మధ్య ప్రేమాయణం నడుస్తుంది అంటూ వైరల్ అవుతున్న వార్తలలో ఎటువంటి నిజం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ” మీడియా వాళ్ళు ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి నాకు పెళ్లి చేసేస్తున్నారు.. ప్రతిసారి ఆ రూమర్ రావడం నేను ఫేక్ అని చెప్పడం అలవాటుగా మారిపోయింది”.
“నా పెళ్లి కోసం బాగా ఎదురు చూస్తున్నట్లున్నారు .. అందుకనే ఈ ఫిబ్రవరిలో నాకు ఎంగేజ్మెంట్ కూడా చేస్తున్నారు” అంటూ ఫన్నీగా రెస్పాండ్ అయ్యారు . వాటిల్లో ఏమాత్రం నిజం లేదని ప్రస్తుతం మేము మా కెరియర్ల పరంగా బిజీగా ముందుకు వెళ్తున్నాము అని క్లారిటీ ఇచ్చారు. ప్రెసెంట్ విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. అంతేకాదు రష్మిక మందన్నా పుష్ప2 సినిమా షూట్ తో పాటు బాలీవుడ్ లో ఏకంగా మూడు ప్రాజెక్టుల్లో బిజీగా ఉంది.