Moviesఆ అగ్రిమెంట్ ప్రకారమే పెళ్లి చేసుకున్న వరుణ్ - లావణ్య.. బయటపడ్డ...

ఆ అగ్రిమెంట్ ప్రకారమే పెళ్లి చేసుకున్న వరుణ్ – లావణ్య.. బయటపడ్డ సంచలన నిజం..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ రీసెంట్ గానే హీరోయిన్ లావణ్య త్రిపాఠిను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతున్నా కానీ బయటపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్న ఈ హీరో హీరోయిన్ ఆ తర్వాత ఫైనల్లీ ఇంట్లో పెద్దలను ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నారు . ఇటలీలో వీళ్ళ పెళ్లి గ్రాండ్ గా జరిగింది .

వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా బాగా ట్రెండ్ అయ్యాయి. రీసెంట్ గానే వీళ్ళ హనీమూన్ కూడా కంప్లీట్ చేసుకున్నారు . న్యూ ఇయర్ ను గ్రాండ్గా వెల్కమ్ చేసిన కొత్త జంటకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. వరుణ్ లావణ్య అగ్రిమెంట్ ప్రకారమే పెళ్లి చేసుకున్నారు అన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలామంది జంటలు విడాకులు తీసుకుంటున్నారు .

అంతేకాదు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న లవర్స్ కూడా ఇదే విషయం గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు . అయితే వరుణ్ లావణ్యలు కూడా దీని గురించే బాగా చర్చించుకున్నారట. ” ఒకవేళ ఫ్యూచర్లో మన మధ్య గొడవలు వచ్చిన సరే .. నేను అడిగినా నువ్వు డివర్స్ ఇవ్వకూడదు.. నువ్వు అడిగినా నేను డివర్స్ ఇవ్వకూడదు” అంటూ వాళ్లకు వాళ్లే మనసులతో ఒక అగ్రిమెంట్ రాసుకున్నారట. ప్రామిస్ చేసుకొని మరీ చచ్చేవరకు ఇద్దరం కలిసే ఉండాలి అంటూ డిసైడ్ అయ్యారట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news