నటుడు.. అనేక క్యారెక్టర్ పాత్రలతో తెలుగు సినీ రంగంపై ప్రత్యేకంగా ముద్ర వేసుకున్న ప్రభాకర్‌రెడ్డి.. జీవితంలో అనేక ఒడిదుడుకులు వచ్చాయి. ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి. మొదట ఆయన డాక్టర్ చదివారు. ఎంబీబీఎస్ పూర్తి చేస్తున్నసమయంలో ఆయన కాలేజీలో నాటిక వేశారు. దీనికి న్యాయ నిర్ణేతగా అప్పటి అగ్ర నటుడు ఎస్వీ రంగారావు వచ్చారు. ఆయన ప్రభాకర్‌రెడ్డి నటనకు ముగ్ధులయ్యారు.
దీంతో తాను నటిస్తున్న సినిమాలో క్యారెక్టర్ పాత్ర ఉందివేస్తావా అంటూ.. సొంత ఖర్చులతో మద్రాస్ తీసుకువెళ్లారు. ఇలా.. రెండు మూడు సినిమాల్లో క్యారెక్టర్ పాత్రలు వేశాక.. హీరోలకు ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుందని తెలిసిన ప్రభాకర్‌రెడ్డి.. హీరో పాత్రలవైపు మొగ్గు చూపారు. దీంతో ఒకటి రెండు ఆపర్లు వచ్చాయి. అయితే.. అనూహ్యంగా ఆయన సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.
మరోవైపు.. ఎంబీబీఎస్ చదివినా. అప్పటికి దాదాపు నాలుగేళ్లు ప్రాక్టీస్‌కు దూరంగా ఉండడంతో వృత్తివైపు మొగ్గు చూపలేక పోయారు. ఒక సందర్భంలో మద్రాస్‌లో ఆయన ఉంటున్న రూంకు అద్దె కూడా చెల్లించ లేని పరిస్థితి వచ్చింది. దీంతో జీవితంపై విరక్తి చెంది.. సూసైడ్ నోట్ రాసుకుని తలకింద పెట్టుకున్నారు. అదేరూంలో ఉంటున్న బాలకృష్ణకు.. ఈ విషయం తెలిసింది. దీనిని ఆయన అన్నగారు ఎన్టీఆర్‌కు చెప్పారు.
దీంతో ఎన్టీఆర్ ప్రభాకర్‌రెడ్డిని పిలిచి మందలించి.. తన సినిమాల్లో వేషం ఇప్పించారు. ఇక. అప్పటి నుంచి ప్రభాకర్‌రెడ్డి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా.. సినిమాల్లో బిజీ అయిపోయారు. చివరి వరకు ఆయన సినిమాల్లో నటిస్తూనే వచ్చారు. ఆయన వారసులు సినీ రంగంలోకి రావాలని అనుకున్నా.. కొన్నికారణాలతో వారినిప్రభాకర్‌రెడ్డి రానివ్వలేదని అంటారు.