టాలీవుడ్లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి జరిగాక కూడా సినిమాలు చేస్తూ ముందుకు వెళుతోంది. చిరుతో ఆచార్య సినిమాలో హీరోయిన్గా ఎంపికైన టైంలో కాజల్ ఆ సినిమా చేస్తోంది. ఆ పెళ్లి కోసమే ఆమె ఆచార్య నుంచి తప్పుకుంది. పెళ్లి తర్వాత కూడా కాజల్ బాలయ్యతో భగవంత్ కేసరి సినిమా చేసి హిట్టు కొట్టింది. కాజల్ తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
సీనియర్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు అందరితోనూ సినిమాలు చేసింది. ఎన్టీఆర్, బన్నీ లాంటి హీరోలకు ఆమె సూపర్ హిట్లు ఇచ్చిన సెంటిమెంట్ హీరోయిన్. పెళ్లయ్యాక ఇప్పుడు ఓ బిడ్డకు తల్లయ్యాక కూడా ఆమె మంచి ఛాన్సులు వస్తే హీరోయిన్గా చేసే విషయంలో వెనక్కు తగ్గడం లేదు. కాజల్ చిరు, బాలయ్య పక్కన నటించినా వెంకటేష్ పక్కన మాత్రం హీరోయిన్గా చేయలేదు.
ఓ సినిమాలో ఆమె ముందుగా వెంకీకి జోడీగా ఎంపికైంది. ఆ సినిమా ఏదో కాదు… వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన వెంకీ మామ సినిమా కామెడీ ఎంటర్టైన్మెంట్గా నిలిచింది. బాబి ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా, వెంకీ పక్కన పాయల్ రాజ్ పుత్ నటించారు. నిజంగా ఈ పాయల్ వెంకీకి జోడీగా నటించి ఉండకపోతే ఆమెకున్న బోల్డ్ ఇమేజ్‌కు ఆమెకు కుర్ర హీరోల సరసన మంచి అవకాశాలే వచ్చి ఉండేవి.
ఎప్పుడు అయితే ఏజ్ బార్ హీరో వెంకీ పక్కన చేసిందో కుర్ర హీరోలు అందరూ ఆమెను లైట్ తీసుకున్నారు. నిజానికి ఈ పాత్ర కోసం ముందుగా కాజల్‌ను సంప్రదించగా ఆమె నో చెప్పడంతో తర్వాత పాయల్‌ను తీసుకున్నారు. పాయల్‌కు సరైన ఛాన్సులు రాక వెంకీ పక్కన రాకరాక వచ్చిన ఛాన్స్ కావడంతో ఎగిరి గంతేసి ఒప్పుకుంది. అదే ఆమె కెరీర్‌కు పెద్ద ఎదురు దెబ్బ అయ్యింది. ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడినా వెంకీ పక్కన పాయల్ పాత్ర మాత్రం ఆమె కెరీర్‌ను నాశనం చేసిందనే చెప్పాలి.