టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణకు ఉండే మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలయ్య 16 ఏళ్ల వయస్సుకే సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు. ఆతర్వాత బాల నటుడిగా తన తండ్రితో కలిసి కొన్ని సినిమాల్లో నటించిన బాలయ్య తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సోలో హీరోగా కెరీర్ మొదలు పెట్టాక బాలయ్య మాస్‌లో దూసుకుపోయాడు.
కెరీర్ ప్రారంభంలో బాలయ్య తన తండ్రితో కలిసి ఎన్నో సినిమాల్లో నటించడంతో పాటు తన తండ్రి దర్శకత్వంలోనూ కొన్ని సినిమాలు చేశాడు. అలా చేసిన సినిమాల్లో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సినిమా ఒకటి. ఈ సినిమా టైటిల్ రోల్ ఎన్టీఆర్ పోషించగా… బాలయ్య ఆయన శిష్యుడు సిద్ధప్ప పాత్రలో కనిపించారు.
బాలయ్య తండ్రి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయ్యాక రిలీజ్ అయిన సినిమా ఇది. కమర్షియల్‌గా తిరుగులేని బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమా ఆ రోజుల్లోనే రు. 4 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా ఎన్టీఆర్ అభిమానులకు ఎప్పటకీ మర్చిపోలేని సినిమాగా నిలిచింది. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా సెన్సార్ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పలుసార్లు వాయిదాలు పడి రిలీజ్ అయ్యి సక్సెస్ కొట్టింది.
ఈ సినిమా షూటింగ్ టైంలోనే బాలయ్యకు ఎలా దర్శకత్వం చేయాలో ఎన్టీఆర్ మెళకువలు కూడా నేర్పేవారట. షాట్ మేకింగ్ ఎలా చేయాలి ? కెమేరా యాంగిల్స్ ఎలా పెట్టుకోవాలనే విషయంపై అవగాహన కూడా కల్పించారట. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ పక్కన నటిస్తూ.. అటు దర్శకత్వం వహిస్తుండగా.. బాలయ్య మాత్రం కెమేరామెన్‌గా చాలా సీన్లు తీశారట. అలా బాలయ్య తన కెరీర్ మొత్తం మీద కెమేరామెన్‌గా పనిచేసిన ఒకే ఒక్క సినిమా ఇది.