Moviesనిహారిక‌కు లావ‌ణ్య త్రిపాఠి ఆడ‌ప‌డుచు క‌ట్నం ఇదే... గ‌ట్టిగానే లాగేసింది...!

నిహారిక‌కు లావ‌ణ్య త్రిపాఠి ఆడ‌ప‌డుచు క‌ట్నం ఇదే… గ‌ట్టిగానే లాగేసింది…!

మెగా వారసుడు వరుణ్ తేజ్, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ప్రేమించుకున్న మాట నిజం.. వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు రావడం నిజం. అయితే ఎప్పుడు వారిద్దరూ అవును.. తాము ప్రేమలో ఉన్నాం అన్న విషయాన్ని బయటకు చెప్పలేదు.. అయినా సరే వీరి ప్రేమను అభిమానులు.. మీడియా వాళ్ళు పసిగట్టేశారు. మొత్తానికి కొంతకాలం పాటు ప్రేమ పక్షుల్లా వ్యవహరించిన ఈ జంట గత ఏడాది పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక వరుణ్ వచ్చే నెలలో ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు.

ఇటు లావణ్య మిస్ ఫర్ఫెక్ట్ వెబ్ సిరీస్ తో ఓటీటీ ఆడియెన్స్‌ను వ‌చ్చే నెల‌లోనే అలరించనుంది. ప్రస్తుతం ఈ జంట తమ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లావణ్యకు ఆడపడుచు కట్నం గురించి ఆసక్తికర ప్రశ్న ఎదురయింది. మీరు నిహారికతో ఎంతో సరదాగా ఉంటారు.. మరి పెళ్లి సమయంలో ఆమెకు ఆడ‌ప‌డుచు కట్నం ఏమైనా ఇచ్చారా ? అని యాంకర్ అడిగాడు.

దీనికి లావణ్య స్పందిస్తూ అలా ఏమీ ఇవ్వలేదని తెలిపింది. నిహారికకు కట్నంగా డబ్బులు ఏమి ఇవ్వలేదని.. అయితే తన కుటుంబ సభ్యురాలు కాబట్టి తన ఆడపడుచు నిహారిక కోసం ఏదైనా చేస్తానంటుంది. లావణ్య మంచి కథతో వస్తే నిహారిక బ్యానర్లో నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. ఆమె ఫ్యామిలీ కాబట్టి ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా ఫ్రీగా న‌టిస్తానని చెప్పుకొచ్చింది.

ఏదేమైనా లావ‌ణ్య‌.. నిహారిక‌కు చాలా బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చేసింది. ఇప్పుడు నిహారిక చేయాల్సింద‌ల్లా త‌న బ్యాన‌ర్లో ఓ సినిమా నిర్మించుకోవ‌డ‌మే. నిహారిక విడాకుల త‌ర్వాత సినిమాల‌పై కాన్సంట్రేష‌న్ చేయ‌డంతో పాటు ఓ బ్యాన‌ర్ కూడా స్టార్ట్ చేసింది. మ‌రి త‌న వ‌దిన ఇచ్చిన ఆఫ‌ర్ యూజ్ చేసుకుని ఎప్పుడు సినిమా తీస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news