జబర్దస్త్ ..చాలామందికి లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎంతో మంది కమెడియన్స్ జబర్దస్త్ షోకి వచ్చాక లైఫ్ లో బాగా సెటిల్ అయ్యారు . వాళ్లలో ఒకరే ఫైమా. ముందుగా పటాస్ అనే షో తో ప్రవీణ్ -ఫైమ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు . ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా మరింత స్థాయిలో వాళ్ళ పేరు అందరికీ గుర్తుండేలా చేసుకున్నారు. అయితే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని వీళ్ల ప్రవర్తన బట్టి తెలిసిపోతుంది.
కానీ సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ ప్రవీణ్ ఫైమ విడిపోయారు .. బ్రేకప్ చెప్పుకున్నారు అన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని వాళ్ళు కూడా కన్ఫామ్ చేశారు . రీసెంట్గా ఈ షోకి హాజరైన ప్రవీణ్ ఫైమ తమ బ్రేకప్ విషయాన్ని అఫీషియల్ గా బయటపెట్టారు . ప్రవీణ్ మాట్లాడుతూ ..”ఫైమకి నేను నచ్చలేదు అందుకే నన్ను దూరం పెడుతుంది అంటూ స్టేజి పైన నిర్మొహమాటంగా చెప్పడం అభిమానులకి షాకింగ్ అనిపించింది”. అంతేకాదు వీళ్ళిద్దరిని కలపడానికి హైపర్ ఆది – రష్మీ ఎంత ట్రై చేసినా సరే ఫీమ మాత్రం అతడిని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు ..
చాలా ఇబ్బందికరంగానే అతగాడిని తాకుతూ వచ్చింది . దీంతో రష్మీ “నువ్వు అతడు అంటే ఇష్టం అంటున్నావు కానీ ముట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నావ్ అసలు మ్యాటర్ ఏంటి అంటూ అసలు నిజం బయట పెట్టడానికి బాగా ట్రై చేసింది ” . అసలు వీళ్ళు ఎందుకు విడిపోయారు ..?? వీళ్ళు విడిపోవడానికి కారణం ఏంటి ..?? అనేది ఫుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే కానీ తెలియదు అంటున్నారు అభిమానులు. ప్రజెంట్ ఫైమా ప్రవీణ్ ల పేర్లు మారుమ్రోగిపోతున్నాయ్..!!