సినిమా ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే హీరోయిన్స్ చాలా తక్కువ.. ఎక్కడ ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే అవకాశాలు ఇవ్వరు ఏమో అన్న భయంతో ముందు నుంచే తమలో ఉన్న ఆలోచనలను ధైర్యాన్ని తొక్కేస్తూ ఉంటారు . ఆల్మోస్ట్ మన ఇండస్ట్రీలో ఉన్న అందరూ హీరోయిన్స్ అదే విధంగా ఉంటారు . కానీ కొంతమంది మాత్రమే బోల్డ్ గా ఆన్సర్ ఇవ్వడానికి ఉన్నది ఉన్నట్లు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు .
వాళ్ళల్లో ఒకరే మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయి ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మెప్పిస్తున్న మృణాల్ ఠాకూర్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసింది . “తనకి రొమాంటిక్ సినిమాలు చేయడం అంటే చాలా ఇష్టం అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చిన మృణాల్ చాలామందికి కూడా అలాంటి సినిమాలే చూడాలని ఉంటుంది అని”…
“అయితే పైకి మాత్రం మాకు రొమాంటిక్ సినిమాలు నచ్చవు .. రొమాంటిక్ సినిమాలు చూడము అని చెప్పుకుంటూ ఉంటారని .. కానీ దొంగ చాటుగా వాళ్ళందరూ అలాంటి సినిమాలే చూస్తూ ఉంటారు అని.. నిర్మోహమాటంగా.. నిక్కచ్చుగా చెప్పేసింది . దీంతో మృణాల్ బోల్డ్ ఆన్సర్ కి జనాలు షాక్ అయిపోతున్నారు .మృణాల్ చెప్పింది అక్షర సత్యం అంటూ ఆమెను పొగిడేస్తున్నారు”..!!