టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్‌బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు తాజాగా చేస్తున్న సినిమా భక్త కన్నప్ప. పాన్ ఇండియా రేంజ్‌లో విష్ణు కెరీర్‌లోనే అత్యధికంగా రు. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం మంచు విష్ణు చాలా కష్టపడుతున్నాడు. తాజాగా ఈ సినిమా మేకర్స్ ఇంటర్వెల్ షూట్‌కు సన్నాహాలు చేసుకుంటోంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్ కూడా వేసినట్టు తెలుస్తోంది.
ఈ ఇంటర్వెల్ సీన్‌లోనే గూస్‌బంప్స్ మోత మధ్య శివుడిగా ప్రభాస్ ఎంట్రీ ఉంటుందట. అసలు కన్నప్ప సినిమా మొత్తానికే ఈ ఎపిసోడ్ చాలా హైలెట్‌గా ఉండబోతోందని అంటున్నారు. ఇక ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించబోతున్నట్టు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నా కూడా మంచు ఫ్యామిలీతో ఉన్న స్నేహం నేపథ్యంలోనే ఈ శివుడి పాత్రలో నటించేందుకు ఓకే చెప్పిన సంగతి విదితమే.
ఇక ప్రభాస్ ఎంట్రీ ఇంటర్వెల్ సీన్ షూట్ కోసం కన్నప్ప టీం చాలా జాగ్రత్తలు తీసుకుంటోందట. ఇక కన్నప్ప తెలుగు వాడే. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట ప్రాంతంలోని ఉటుకూరు ఈయన స్వస్థలం. కన్నప్ప టీం ఈ ఊళ్లో కూడా సినిమాకు సంబంధించి కొన్ని సీన్లు షూట్ చేసింది. ఆ తర్వాత వీరు న్యూజిలాండ్‌కు వెళ్లి అక్కడ మేజర్ టాకీపార్ట్ షూట్ చేసింది.
ఇక ప్రభాస్ మహాశివుడిగా కనిపిస్తుంటే నయనతార పార్వతీదేవీగా నటిస్తోంది. ఈ సినిమాలో మరిన్ని సర్‌ఫ్రైజ్‌లు ఉంటాయని అంటున్నారు. కొన్ని స్టార్స్ పేరు కూడా సినిమాలో యాడ్ అవుతాయని.. అవన్నీ సర్‌ప్రైజింగ్‌గా ఉండబోతున్నాయంటున్నారు.