ప్రజెంట్ సోషల్ మీడియాలో టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా విడాకులు ఎలా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయో మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ జంటలు విడాకులు తీసుకున్నారు . అలాగే పలువురు స్టార్ స్పోర్ట్స్ సంబంధించిన వ్యక్తులు కూడా విడాకులు తీసుకున్నారు .కానీ అందరిలోకి సానియా మీర్జా విడాకులు ఇప్పుడు సెన్సేషన్ సృష్టిస్తుంది . సానియా మీర్జా ఎప్పుడు కూడా తప్పుడు డెసిషన్స్ తీసుకోదు అని .. ఆమె తీసుకున్న ప్రతి డెసిషన్ సక్సెస్ అవుతుంది అని అభిమానుల్లో గట్టి నమ్మకం ఉంటుంది .
అయితే పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సానియా మీర్జా విడాకులు ఇచ్చేసింది . ఈ విషయాన్ని ఆమె తండ్రి అఫీషియల్ గా ప్రకటించాడు. అంతేకాదు ఆయన పాకిస్తాన్ నటి సనా జావేద్ ని మూడో పెళ్లి చేసుకున్నాడు . దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సానియా మీర్జాకు షోయబ్ మాలిక్ కు ఒక బాబు కూడా పుట్టాడు .
ఇప్పుడు ఆ బాబు ఎవరి దగ్గర ఉంటాడు అనేది ప్రశ్నార్ధకంగా మారింది . అయితే చాలా చక్కగా చూడముచ్చటగా ఉన్న ఈ జంట విడిపోవడానికి కారణం ఏంటా..? అంటూ సోషల్ మీడియాలో జనాలు రక రకాలుగా ప్రశ్నిస్తున్నారు . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సానియా మీర్జానే ముందు విడాకులు కావాలి అంటూ షోయబ్ ను అడిగిందట . ఆయన పద్ధతి ఆయన బిహేవియర్ నచ్చకపోవడంతోనే ఆమె ఇలా విడాకులు తీసుకున్నిందట. సానియా మీర్జాను ఫిజికల్ గా మెంటల్ గా ఎక్కువగా టార్చర్ చేశాడు షోయబ్ మాలిక్ అంటూ కూడా సానియా అభిమానులు చెప్పుకొస్తున్నారు..!!